Naga Chaitanya: మరో యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

జోష్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అప్పట్లో కొన్ని కారణాల వలన సరిగ్గా ఆడలేదు. కానీ ఇప్పుడు జోష్ సినిమా చూసిన ప్రతిసారి కూడా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అంత బాగా తీసాడు వాసు వర్మ ఆ సినిమాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమా కమర్షియల్గా హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ ఆ సినిమాలోని డైలాగ్స్ ని ఆ క్యారెక్టర్జేషన్ చాలామంది ఇష్టపడుతుంటారు.

ఇకపోతే ఆ తర్వాత నాగచైతన్య చేసిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. స్టిల్ ఇప్పటికే ఆ సినిమాను చూసినా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ సినిమాతో ఒక మ్యాజిక్ సృష్టించాడు గౌతమ్. ఈ సినిమాతోనే సమంత హీరోయిన్గా తెలుగు పరిచయమైంది. ఇకపోతే ఆ తర్వాత చైతన్య చాలా సినిమాలు చేశాడు.

చైతు కెరియర్ లో మంచి హిట్ సినిమాలు అండి ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, ప్రేమమ్, లవ్ స్టోరీ వంటి సినిమాలను చెప్పొచ్చు. అక్కినేని హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య తక్కువ టైంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇకపోతే నాగచైతన్య మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

- Advertisement -

విరూపాక్ష సినిమాతో అద్భుతమైన ఘనవిజయాన్ని అందుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. కేవలం ఆ సినిమా కార్తీక్ దండు కి మాత్రమే కాకుండా సాయి దుర్గ తేజ్ కి మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత సాయి దుర్గ తేజ్ ఈ సినిమాను చేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి, సాయి తేజ్ పాన్ ఇండియా హీరోని చేసేసింది.

ఇకపోతే విరూపాక్ష సినిమా తర్వాత కార్తీక్ దండుకి డిమాండ్ కూడా పెరిగింది. ఇప్పుడు కార్తీక్ దండు నాగచైతన్యకి రీసెంట్ గా ఒక కథ వినిపించినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఆ కథ నాగచైతన్యకి విపరీతంగా నచ్చింది అంట. కార్తీక్ దండుతో సినిమా చేయడానికి నాగచైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తుంది దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

లేకపోతే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు చందు. ఇప్పుడు నాగచైతన్యతో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు