Sandeep Kishan: యంగ్ హీరోకి తల్లిగా ప్రభాస్ బ్యూటీ.. హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..!

Sandeep Kishan.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ముఖ్యంగా హీరోకి ఉండే లైఫ్ టైమ్ ..హీరోయిన్ కి ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు.. అయితే హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా హీరోలు గానే కొనసాగుతారు.. కానీ హీరోయిన్స్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారంటే కచ్చితంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతారు.. అయితే ఆ సెకండ్ ఆర్టిస్టు పాత్రలు అక్క, వదిన లాంటి పాత్రలైతే ఓకే.. కానీ తల్లి , అత్త పాత్రలైతే మాత్రం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన్మధుడు సినిమాలో నాగ్ కి జోడిగా , రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించి యువత కలల రాకుమారిగా మారిన అన్షు అంబానీ ఇప్పుడు ఒక హీరోకి తల్లిగా నటిస్తూ ఉండడం తెలిసి ప్రభాస్ అభిమానులు హర్ట్ అవుతున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Sandeep Kishan: Prabhas's beauty as the young hero's mother.. fans are getting hurt..!
Sandeep Kishan: Prabhas’s beauty as the young hero’s mother.. fans are getting hurt..!

సందీప్ కిషన్ కి తల్లిగా అన్షు..

యంగ్ డైరెక్టర్ సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఊరు పేరు భైరవకోన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్.. తాజాగా మరోవైపు స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో వైబ్ అనే చిత్రాన్ని ప్రకటించారు.. ఈ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే.. మరొక సినిమాని ప్రకటించారు సందీప్ కిషన్. రవితేజ , శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో SK 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. ఈ సినిమా ద్వారానే సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది అన్షు అంబానీ.. ఈ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నటించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇటీవలే అన్షుని కలిసి త్రినాధరావు కథ వినిపించగా.. ఆమె కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అన్ని ఓకే అయితే త్వరలోనే ఈమె రీ యంట్రి ఖాయం అని తెలుస్తోంది.. ఇకపోతే ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యాక్టింగ్ వదిలేయడానికి కారణం అదే..

తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అన్షు… మూడు నాలుగు సినిమాలతోనే తన సినీ కెరియర్ కి ఎండ్ కార్డు వేయడంతో చాలామంది అభిమానులు ఫీలయ్యారు అసలు ఎందుకు నటన వదిలేసారని చాలామందిలో ఇన్నాళ్లు ఒక సందేహం ఉండేది.. కానీ ఇటీవల హైదరాబాద్ కి తిరిగి వచ్చిన ఈమె తాను యాక్టింగ్ మానేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.. తన తండ్రి ఓవర్ ప్రొటెక్టివ్ అవడం వల్లే సినిమాలకు గుడ్ బై చెప్పేసానని కానీ నటించాలనేఆశ అలానే ఉండిపోయిందని.. అందుకే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పుకొచ్చింది. ఇకపోతే హీరోయిన్ గా కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలా యంగ్ హీరోకి తల్లిగా నటిస్తుండడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు. మరి ఈ పాత్ర ఈమెకు ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anshu Saggar (@actressanshuofficial)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు