Colors Swathi : ఛీ… నీ బతుకు అంటూ కలర్స్ స్వాతిపై నెటిజెన్ కామెంట్… ఆమె నుంచి ఊహించని రియాక్షన్

Colors Swathi : సెలబ్రిటీలకు సోషల్ మీడియా వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తప్పట్లేదు. ఒకవైపు ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నాము అన్న ఆనందం ఉంటే, మరోవైపు నెటిజన్లు రెచ్చిపోయి చేస్తున్న కామెంట్లను భరించాల్సి వస్తోంది. సెలబ్రిటీలు అన్న జ్ఞానం కూడా లేకుండా డైరెక్ట్ గా మొహం మీద ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురు కాగా, కలర్స్ స్వాతి ఊహించని విధంగా రెస్పాండ్ అయ్యింది. ఛీ నీ బతుకు… అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు స్వాతి ఎలా రియాక్ట్ అయ్యిందంటే…

నెటిజన్ కు ఇచ్చిపడేసిన స్వాతి..

రీ ఎంట్రీ తరువాత ఇప్పుడిప్పుడే సినిమాల పరంగా మళ్లీ బిజీ అవుతున్న స్వాతికి సోషల్ మీడియాలో తాజాగా చేదు అనుభవం ఎదురైంది. నెగిటివ్ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. స్వాతి షేర్ చేసిన వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ ఛీ నీ బతుకు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్ ఎదురైనప్పుడు సెలబ్రిటీలు కోపంతో ఊగిపోతారు. కానీ కలర్స్ స్వాతి మాత్రం కూల్ గా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చిపడేసింది. నాకు కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది… అంటూ నవ్వుతున్న ఎమోజిని షేర్ చేసింది. అంతేకాదు జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ ట్యాగ్ యాడ్ చేసింది. కూల్ గానే అవతలి వ్యక్తి నోరు మూయించింది. దీంతో తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారి పట్ల స్వాతి స్పందించిన తీరుపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వాతి రిప్లైకి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పెళ్లి తరువాత సినిమాలకు దూరం..

కలర్స్ స్వాతి… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి వెండితెర ప్రేక్షకుల దాకా ప్రతి ఒక్కరికి బబ్లీ గాల్ కలర్స్ స్వాతి గురించి బాగా తెలుసు. కలర్స్ అనే ప్రోగ్రాంతో యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన స్వాతి కార్తికేయ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన స్వాతి ఇటీవలే మంత్ ఆఫ్ మధు అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించింది.

- Advertisement -

వివాదాలు తక్కువేం కాదు…

ఇక సినిమాల పరంగా సక్సెస్ ఫుల్ నటిగా రాణిస్తున్న స్వాతి తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తక్కువ ఆఫర్లు వచ్చినా వాటినే సద్వినియోగపరచుకుని హీరోయిన్ గా స్థిరపడిపోయిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ పై స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆమె అభిమానులు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతి ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అంటూ మొహం మీద కొట్టినట్టుగా సమాధానం చెబుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు