Nookaraju: అవకాశాల కోసం సిరి అలాంటి పని.. గుట్టు రట్టు చేసిన కమెడియన్..!

Nookaraju.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుని బిగ్ బాస్ హౌస్ లో తన అందచందాలతో , నటనతో ప్రేక్షకులను మెప్పించిన సిరి హనుమంతు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూ మరింత క్రేజ్ సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తోంది.. ఇదిలా ఉండగా తాజాగా అవకాశాల కోసం ఏం చేసింది అనే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తాజాగా బయటపెట్టారు.. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..

Nookaraju: Siri works like this for opportunities.. Secret reveals by comedian..!
Nookaraju: Siri works like this for opportunities.. Secret reveals by comedian..!

బిగ్ బాస్ సీజన్ – 5 లో సిరి..

సిరి హనుమంతు హౌస్ లో తన నటనతో , గేమ్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది కానీ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ కి దగ్గరవుతున్నట్టు కనిపించడంతో తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది. అంతేకాదు ఈమె కారణంగానే షణ్ముఖ్ తన లవర్ కి దూరమయ్యాడు.. నిజానికి షో లో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నా.. వీరి ప్రవర్తన వల్ల అందరికీ వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు కలిగాయి.. ఇక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి అడుగుపెట్టిన తర్వాత పలు షోలలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సిరి పాపులర్ టీవీ షో జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తోంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు పెద్దగా అవకాశాలు రావని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి దీనికి సింక్ అయ్యే విధంగా నూకరాజు సిరిపై వేసిన పంచులు ఇప్పుడు హైలైట్ గా మారుతున్నాయి..

సిరి అవకాశాల కోసం అలాంటి పని చేసింది..

తాజాగా జబర్దస్త్ నుంచి ప్రోమో ని రిలీజ్ చేశారు .. అందులో నూకరాజు స్కిట్ హైలైట్ గా కనిపిస్తోంది… చెప్పులు కుట్టేవాడి పాత్రలో నూకరాజు కనిపించారు ముందుగా జడ్జిగా ఉన్న మరో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ పై పంచులు వేసారు..షూటింగ్ కి కృష్ణ భగవాన్ కి టైం అవుతోంది. త్వరగా చెప్పులను ఇంటికి పంపించాలి అంటూ ఆత్రంగా కవర్ ఓపెన్ చేయగా.. అందులో ఒకటి లేడీ.. మరొకటి బాయ్ చెప్పులు కనిపించాయి. నైట్ కన్ఫ్యూజన్లో పంపించినట్టు ఉన్నారు అంటూ కృష్ణ భగవాన్ పై జోక్ వేశారు నూకరాజు.. ఆ తర్వాత ఈ చెప్పులు ఎవరివి ఇంతగా అరిగిపోయాయి? అని మరో కమెడియన్ ప్రశ్నించగా.. అవి యాంకర్ సిరి వి అని అన్నాడు.. ఎందుకు ఇంతలా అరిగిపోయాయి? అని అడిగితే.. అవకాశాల కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి అంటూ సమాధానమిచ్చాడు నూకరాజు. ఇంతలో ఆ కమెడియన్ మరి అవకాశాలు లభించాయా అని అడిగితే.. లేదు మోకాళ్లు కూడా అరిగిపోయాయి అంటూ పంచ్ వేశాడు.. అయితే సిరి ఈ జోక్ కు కొంచెం నవ్వినా సీరియస్గా అయితే లుక్ ఇచ్చింది.. మొత్తానికి అయితే ఈ స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . ఇకపోతే గురువారం రోజున ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు