Prabhas: నిజమైన సినిమా లవర్

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోలను మొట్టమొదటి స్టార్ హీరో ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అతి తక్కువ టైంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ప్రభాస్ కి వర్షం సినిమాతో మొదటి హిట్ వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ ని ఒక స్టార్ హీరోని చేసింది.

ప్రభాస్ ఇప్పటివరకు చాలామంది దర్శకులతో పనిచేస్తూ వచ్చారు. ఇకపోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సినిమా బుజ్జిగాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ చాలామంది బుజ్జిగాడు సినిమా అంటే ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఇకపోతే బుజ్జిగాడు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో దర్శకుడు పూరీని ప్రభాస్ చాలాసార్లు డార్లింగ్ ఇదిలా చేద్దాం, డార్లింగ్ అది అలా చేద్దాం. అంటూ పిలిచేవాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇకపోతే నన్ను డార్లింగ్ అని పిలుస్తున్నాడు నేనంటే అంత ఇష్టమేమో అనుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ ప్రభాస్ అందర్నీ డార్లింగ్ అని పిలుస్తాడు అని పూరికి కొన్ని రోజుల తర్వాత అర్థమైంది.

ఇకపోతే కరుణాకర్ దర్శకత్వంలో డార్లింగ్ అనే సినిమాను చేశాడు ప్రభాస్. ఆ సినిమాలో ప్రభాస్ పర్ఫామెన్స్ చాలామందిని ఫిదా చేసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కమర్షియల్ విజయ్ అన్నందుకు ఉన్నాయి. ఆ సినిమా టైటిల్ కి ఆ కథకి అలానే ప్రభాస్ పెర్ఫార్మెన్స్ కి ఆ సినిమాలో మంచి మార్క్స్ పడ్డాయని చెప్పొచ్చు.

- Advertisement -

డార్లింగ్ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ కి బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కి ఒక క్లాస్ ఇమేజ్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇకపోతే మిర్చి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు.

ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. బాహుబలి సినిమా తర్వాత కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా సలార్ సినిమా ప్రభాస్ కి ఒక కంబ్యాక్ ఫిలిం అయింది. అయితే నేడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయినా కూడా తన వ్యక్తిత్వంలో మాత్రం ఏ మాత్రం గర్వం లేదు అని చెప్పొచ్చు.

బేసిగ్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఎవర్ని ఎంకరేజ్ చేయరు అంటూ బయట మాటలు వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో కూడా కొంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు అంటూ అంటుంటారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే ఎక్కువ శాతం సినిమాలకు తను కూడా తన వంతు ప్రోమోషన్ చేస్తూ ఉంటాడు. ప్రభాస్ ఏ సినిమా రిలీజ్ అయిన కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ సినిమాకు విషెస్ చెబుతూ స్టోరీ పెడుతుంటాడు.

ఇకపోతే రీసెంట్ గా ఓం భీమ్ బుష్ అనే సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి కూడా తన విషెస్ తెలియజేశాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమాను యు వి క్రియేషన్స్ నిర్మించింది. ఆ బ్యానర్ తన స్నేహితులనే కాకుండా, చాలా సినిమాలకి ఇలానే ప్రోమోట్ చేసుకుంటూ వచ్చాడు ప్రభాస్. బహుశా అందుకే అందరూ ప్రభాస్ ని కూడా డార్లింగ్ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు