Om Bheem Bush First Review: ఓం భీమ్ బుష్ మూవీ ఫస్ట్ రివ్యూ

హుషారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీహర్ష కొనుగంటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ఏకంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో అవకాశం సాధించి రౌడీ బాయ్స్ అనే సినిమాను తెరకెక్కించాడు శ్రీ హర్ష. అయితే ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా ఓం భీమ్ బుష్ అనే సినిమాను తెరకెక్కించాడు శ్రీహర్ష.

ఈ సినిమాలో శ్రీ విష్ణు మెయిన్ లీడ్‌గా నటిస్తున్నాడు. శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు చేశాడు. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా మెంటల్ మదిలో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. ఈ సినిమాతోనే వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కేవలం కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో రాఖి రాంబో రాహుల్ వీరి ముగ్గురు కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. మంచి ఫన్ కూడా క్రియేట్ అయింది. ఇక అదే తరహాలో ఓం భీమ్ బుష్ సినిమా కూడా ఆకట్టుకుంటుంది అని అందరూ అనుకున్నారు.

- Advertisement -

ఓం భీమ్ బుష్ కథ ఫస్ట్ రివ్యూ
ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ఇదివరకే కొంతమంది ప్రముఖులు చూశారు. చూసిన వారి దగ్గర నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. శ్రీ విష్ణు, ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి మొదటి రివ్యూ ఒకటి బయటకు వచ్చింది. ఊహించిన విధంగా ఈ సినిమా ఏమీ లేదని, అంత సిల్లీ కామెడీ అని, సోషల్ మీడియాలో మీమ్స్ ని జోకులుగా సినిమాలో ఇరికించారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే సినిమా ఇంకా బయటికి రాలేదు కాబట్టి వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కి ఎటువంటి సినిమా నచ్చుతుందో వాళ్ళు ఎటువంటి సినిమాని ఆదరిస్తారు అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకవేళ అదే డిసైడ్ చేయగలిగితే ఇండస్ట్రీలో అన్ని హిట్ సినిమాలు వస్తాయి. అయితే ఈ సినిమా జాతి రత్నాలు తరహాలో ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత దీని ఫలితమేంటో పూర్తిగా తెలిసి వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా టీజర్ అని ట్రైలర్ మాత్రం అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నయని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రోమో సెన్స్ లో భాగంగా ఇప్పటివరకు టచ్ అయిన పాయింట్ ను ఈ సినిమాలో టచ్ చేసామని శ్రీ విష్ణు చెబుతూ వస్తున్నాడు. మరి ఆ పాయింట్ ఏంటా అని చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు కూడా.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు