Sree Vishnu: చాలా కాలం నాటి కల నెరవేరింది

ప్రతి హీరోకి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ ఉంటాయి. కొంతమంది హీరోలకి కొంతమంది దర్శకులతో పనిచేయాలని ఉంటుంది. అలానే కొంతమంది దర్శకులకి కొంతమంది హీరోలతో పనిచేయాలని ఉంటుంది. ఇకపోతే చాలామంది హీరోలకి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో పనిచేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం చాలా మెట్లెక్కుతూ ఎట్టకేలకు దానిని అందుకొని ఆ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తారు.

బాణం సినిమాలోని ఒక పాత్ర ద్వారా పరిచయమైన నటుడు శ్రీ విష్ణు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో లీడ్ రోల్ లో నటించి, తర్వాత “మెంటల్ మదిలో” అనే సినిమాతో కంప్లీట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పుడు చాలామంది ప్రేక్షకులకి శ్రీ విష్ణు సినిమా అంటే ఖచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు.

శ్రీ విష్ణు చేసిన ప్రతి సినిమా కూడా దేనికి అదే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఒక టైం లో శ్రీ విష్ణు సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అవ్వటం మొదలుపెట్టాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సామజవరగమన అనే సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ తో పాటు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ సినిమాని మినీ “నువ్వు నాకు నచ్చావ్” అంటూ కూడా కొంతమంది రాయడం మొదలుపెట్టారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం శ్రీ విష్ణు చేస్తున్న సినిమా “ఓం భీమ్ బుష్” ఈ సినిమా కూడా జాతి రత్నాలు టైప్ లో మంచి ఫన్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే శ్రీ విష్ణు బర్త్ డే సందర్భంగా చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి శ్రీవిష్ణు చేస్తున్న ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వచ్చాయి.

ఇంక శ్రీ విష్ణు చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ స్క్వాగ్. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కాంబినేషన్లో ఇదివరకే రాజరాజ చోర అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా కూడా ఆ సినిమాకి మంచి ప్రశంసలు లభించాయి. టెక్నికల్ గా ఆ సినిమాను హసిత్ డిజైన్ చేసిన విధానం చాలామందికి నచ్చింది.

ఇకపోతే ప్రస్తుతం శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ లో సినిమాను చేస్తున్నాడు. ఎప్పటినుంచో అనుకుంటున్నా కల నేటికి నెరవేరింది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి “నేను వీడని నీడను నేనే” సినిమా ఫేమ్ దర్శకుడు “కార్తీక్ రాజు” దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకొన్ని వివరాలు ముందు ముందు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఈ అనౌన్స్మెంట్ వీడియోను చాలా సర్ప్రైజింగ్ గా రీవీల్ చేశారు.

ఇకపోతే ఒక టైం లో వరుసగా శ్రీ విష్ణు నుంచి డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. అలా కాకుండా చూసీగా సినిమాలు ఎంచుకొని కెరీర్లో ముందుకెళ్తే, శ్రీ విష్ణు ను ఒక హీరోగా సరైన స్థానంలో చూడొచ్చు అనేది చాలామంది నమ్మకం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు