HBD Sree Vishnu: లీప్ ఇయర్ బర్త్ డే… శ్రీ విష్ణుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

దాదాపుగా అందరూ బర్త్ డేను ప్రతి ఏడాది జరుపుకుంటారు. పుట్టినరోజును చాలా స్పెషల్ గా భావిస్తారు కాబట్టి ఆ రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా, సరదాగా గడుపుతారు. కానీ లీప్ ఇయర్ లో పుట్టిన వారికి మాత్రం ఇలా ప్రతి ఏడాది పుట్టినరోజులు జరుపుకునే ఛాన్స్ ఉండదు. వాళ్లకు నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈసారి లీప్ ఇయర్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే టాలీవుడ్ లో లీప్ ఇయర్ లో పుట్టిన ఏకైక స్టార్ శ్రీ విష్ణు.

లీప్ ఇయర్లో పుట్టిన ఏకైక తెలుగు స్టార్
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. కమర్షియల్, హీరోయిజం జోలికి వెళ్ళకుండా కంటెంట్ బేస్డ్, వెరైటీ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు ఈ యంగ్ హీరో. బాణం సినిమాతో 2009లో హీరోగా పరిచయమైన శ్రీ విష్ణు సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, అర్జున ఫాల్గుణ, భళా తందనాన అనే సినిమాల్లో నటించి అలరించాడు.థ

చివరగా “సామజవరగమన” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు ఫిబ్రవరి 29తో 40 వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక లీప్ ఇయర్ లో పుట్టిన ఈ హీరో నాలుగేళ్లకు ఒకసారి వచ్చే తన పుట్టినరోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈరోజు తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న “ఓం భీ బుష్” రిలీజ్ కు రెడీ అవుతుండగా, స్వాగ్, ఏమండో బావున్నారా అనే రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు.

- Advertisement -

లీప్ ఇయర్ లో పుట్టిన సెలబ్రిటీలు వీళ్లే…

ఖలీద్ – సింగర్
ఖలీద్ చిన్నప్పటినుంచి గిటార్, అకార్డియన్ హార్మోనియం వాయించేవాడు. మొరాకో మ్యూజిక్ ప్రపంచంలో దిగ్గజ గాయకుడిగా ఎదిగిన ఖలీద్ అల్జీరియాలోని ఓరాన్లో 1960 ఫిబ్రవరి 29న జన్మించారు.

జాన్వీ చేదా -నటి
“చూనా హై ఆస్మాన్”, “బాలికా వధు”, “సిఐడి” సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వి ఇండియన్ టెలివిజన్ రంగంలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతోంది. ఈ అమ్మడు ఫిబ్రవరి 29నే పుట్టింది.

రాఖీ థక్రార్
బీసీసీ “వన్ సోప్ ఓపెరా ఈస్ట్ ఎండర్స్”, నెట్ ఫ్లిక్స్ కామెడీ డ్రామా “సెక్స్ ఎడ్యుకేషన్”లో ప్రధాన పాత్రను పోషించి పాపులర్ అయ్యింది రాఖి. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ హాలీవుడ్ బ్యూటీ ఫిబ్రవరి 29నే జన్మించింది.

వీళ్లతో పాటు జా రూల్ అనే రాపర్, ఇండియన్ హాకీ ప్లేయర్ ఆడమ్ ఆంటోనీ సింక్లైర్, పాపులర్ టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ మోడల్ లీనా గేర్కే, యాక్టర్ జెస్సీ టి అషర్, ఒలంపిక్ స్విమ్మర్ కల్లెన్ ఆండ్రూ జోన్స్, మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచేజ్ కూడా ఫిబ్రవరి 29నే పుట్టారు. వీళ్లంతా నాలుగేళ్లకు ఒకసారి వెరీ వెరీ స్పెషల్ గా తమ పుట్టిన రోజును జరుపుకుంటారు అన్నమాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు