Ananya Nagalla : పాయల్ బాటలోనే అనన్య… బోల్డ్ సీన్స్ కు రెడీ

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ఎట్టకేలకు గ్లామర్ గేట్లు ఎత్తేయడానికి రెడీ అయింది. రీసెంట్ గా పాపులర్ అయిన తన ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ రొమాన్స్ గురించి ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ అనన్య ముద్దు సీన్ల గురించి ఎలాంటి కామెంట్స్ చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే…

“మల్లేశం”తో ఎంట్రీ…
ప్రియదర్శి హీరోగా నటించిన “మల్లేశం” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది అనన్య. మొదటి సినిమాతోనే అందరి దృష్టికి ఆకట్టుకుని ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. “వకీల్ సాబ్” సినిమాలో ఓ కీలక పాత్రను పోషించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. వరుస డిజాస్టర్లు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తంత్ర, పొట్టేలు అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇందులో “తంత్ర” అనే మూవీ హారర్ నేపథ్యంలో రూపొందుతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే అనన్య తన ముద్దు సన్నివేశం గురించి, రొమాంటిక్ సీన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

హద్దులు దాటడానికి రెడీ
“తంత్ర” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రొమాన్స్ గురించి అనన్యకు ఓ ప్రశ్న ఎదురయింది. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ చిన్నది “పొట్టేలు” సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన “పొట్టేలు” సినిమా ట్రైలర్లో ఓ ముద్దు సీన్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఆమె పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ సీన్లలో నటించింది అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే “పొట్టేలు” సినిమాలో మాదిరిగానే “తంత్ర” సినిమాలో కూడా ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటాయా ? అనే ప్రశ్నకు అనన్య ఇచ్చిన రిప్లై ఇకపై తాను హద్దులు దాటడానికి రెడీ అన్నట్లుగా ఉంది. అనన్య స్పందిస్తూ పొట్టేలు సినిమాకు ముద్దు సన్నివేశం అనేది చాలా అవసరం అని, అందుకే చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. తంత్ర సినిమాలో రొమాంటిక్, బోల్డ్, హారర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పర్ఫామెన్స్ బాగుంటే మంచి రోల్స్ తన దగ్గరకు వస్తాయని అనుకున్నానని, కానీ పర్ఫామెన్స్ లో రొమాంటిక్ రోల్స్ కూడా ఒక భాగమేనని అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టిందని వెల్లడించింది.

- Advertisement -

పాయల్ బాటలో…
హారర్ అండ్ రొమాంటిక్ మూవీ అనగానే ఇప్పుడున్న హీరోయిన్లలో ముందుగా గుర్తొచ్చేది పాయల్. “మంగళవారం” సినిమాతో ఈ అమ్మడు రీసెంట్ గా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆర్ఎక్స్ 100 మూవీతో ఈ బ్యూటీ మొదలుపెట్టిన అందాల ఆరబోతను ఫాలో అవ్వడానికి చాలామంది హీరోయిన్లు ట్రై చేస్తున్నారు. తాజాగా అనన్య గ్లామర్ పాత్రల గురించి ఇచ్చిన వివరణ చూస్తుంటే, “తంత్ర”లో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ చూస్తుంటే తను కూడా పాయల్ బాటలోనే నడవడానికి రెడీ అవుతోంది అనిపిస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు