Taapsee Marriage : తాప్సీకి కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్డం సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు. అలాగే అక్కడ స్థిరపడ్డాక తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఉంటుంది. టాలీవుడ్ పై చేసిన కామెంట్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు తెగ వైరల్ అవుతోంది. దీంతో తాప్సికి కాబోయే భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

తాప్సీ ప్రేమాయణం
రీసెంట్ గా రిలీజ్ అయిన “డంకీ” సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న తాప్సి త్వరలోనే ప్రియుడిని పెళ్లాడబోతోందనే బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఉదయపూర్ లో ఈ బ్యూటీ పెళ్లి జరగనుందని సమాచారం. అయితే పెళ్లయిన తర్వాత ఈ అమ్మడు సినిమాలో నటిస్తుందా లేదా? అనే టెన్షన్ ఆమె అభిమానుల్లో కనిపిస్తోంది. కానీ పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తానని తాప్సీ చెప్తోంది. కాగా తాప్సీ 2014 నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ బోతో ప్రేమాయణం సాగిస్తోంది. రాజ్ షమాని పాడ్ కాస్ట్ టైంలోనే తాప్సీ మాథ్యూస్ బోతో తన రిలేషన్షిప్ గురించి బయట పెట్టింది. ఇన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ ప్రేమ పక్షులు ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అవుతున్నారనే వార్త నట్టింట్లో సందడి చేస్తోంది. అయితే ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ 8 సవత్సరాలు అని తెలుస్తోంది.

మాథ్యూస్ బో బ్యాగ్రౌండ్ ఏంటి?
మాథ్యూస్ 1980లో జన్మించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో 1998లో ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చాడు. 2006లో యూరోపియన ఛాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ లో మాథ్యూస్ రజతం గెలిచాడు. 2010లో జరిగిన డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ను తన సొంతం చేసుకున్నాడు. అలాగే 2011లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో ఛాంపియన్ గా అవతారం ఎత్తాడు. 2012లో జరిగిన లండన్ ఒలంపిక్స్ లో రజత పతకం గెలిచాడు. 2013లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మాథ్యూస్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. అలాగే 2012, 2017 సంవత్సరాలకు గాను యూరోపియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లో విన్నర్ గా నిలిచి ఎంతోమంది అప్ కమింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. 2020లో మాథ్యూస్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

పెళ్లి వార్తలపై తాప్సీ రియాక్షన్
సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి స్టార్టింగ్ లో కాస్త తడబడినా, ఆ తర్వాత స్ట్రాంగ్ గా నిలదొక్కుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ. ఎట్టకేలకు దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న తాప్సీ తన ప్రియుడు మాథ్యూస్ బోను ఈ సమ్మర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుండడం విశేషం. అయితే ఈ వార్తలపై స్పందించడానికి తాప్సి నిరాకరించడం గమనార్హం. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి సమాచారం పంచుకోబోనని, ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాంటి పని చేయనని తాజాగా తాప్సీ చెప్పుకొచ్చింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు