Vennira Aadai Nirmala: తాగొచ్చి ఆ హీరో నా రూమ్ తలుపు తట్టాడు – నటి కామెంట్స్ వైరల్..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అంటూ ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ముందుకు వచ్చి అభిమానులతో తమ బాధలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ తమిళ నటి వెన్నెర ఆడై నిర్మల. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో పై ఈమె షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు దీనిపై చర్చిస్తున్నారు..

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నిర్మల..
ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. నేను తెలుగులో ఎన్నో సినిమాలలో నటించాను. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా తెలుగు సినిమాలో నటించాను.. అయితే ఒకసారి అలా తెలుగులో నటిస్తున్నప్పుడు షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లో నిద్రపోతున్నాను.. రాత్రి సమయంలో ఆ సినిమా హీరో వచ్చి తలుపు కొట్టాడు.. మీరు తలుపు తీయండి.. నేనేం చేయను.. మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అన్నాడు. అప్పటికే ఆయన ఫుల్లుగా మందు తాగి మత్తులో మాట్లాడారు.. ఆ ఘటనతో నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. ఇక దర్శకనిర్మాతలు నన్ను ఎంతలా కన్విన్స్ చేసినప్పటికీ కూడా నేను ఒప్పుకోలేదు.. ఇక నేను అసలు వీటిని సహించను అంటూ వెల్లడించింది.. ఇకపోతే ఆ నటుడు పేరు మాత్రం బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. అయితే వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైనా తెలుగు నటుడి నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది వెన్నెర ఆడై వెన్నెల.

వెన్నర ఆడై వెన్నెల సినిమా జీవితం..
తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె హీరోయిన్గా కూడా భారీ పాపులారిటీ సంపాదించింది. అలా తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాలు చేసిన ఈమె సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.. వెన్నెలాడై చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 400 చిత్రాలకు పైగా నటించింది.

- Advertisement -

తెలుగులో నిర్మల నటించిన సినిమాలు..
ఇక తెలుగులో వెన్నెర ఆడై నిర్మల నటించిన చిత్రాల విషయానికొస్తే.. దత్తపుత్రుడు, మా ఇంటి వెలుగు, పిచ్చి పిల్ల, బొమ్మ బొరుసు , మదర్ ఇండియా, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, భక్త ప్రహల్లాద, కరుణామయుడు, కలిసుందాం రా ,జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలలో చేసింది. అంతే కాదు తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో కూడా నటించింది. మొత్తానికైతే ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది వెన్నెర ఆడై నిర్మల.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు