Radhika Apte : సోషల్ మీడియాలో రాధికాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఎందుకంటే?

బాలీవుడ్ లో వైల్డ్ సినిమాలు, బోల్డ్ సినిమాలు చేసి ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే. ఇటు సౌత్ లోనూ పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఎక్కువ మందికి కబాలి చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా తెలుసు. అయితే తెలుగులో అతికొద్ది సినిమాలలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. మొదటగా రక్త చరిత్ర అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన ఈ భామ, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ నిర్మించిన ధోని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత బాలయ్యతో ఏకంగా లెజెండ్, లయన్ వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అడపాదడపా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది.

అయితే రాధికా ఆప్టే ముక్కు సూటితనంగా కాస్త మొండిగానూ ఉంటుందని పలు ఇంటర్వ్యూ లలో చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీ లో మేల్ డామినేషన్ ఉందంటూ కొన్ని కాంట్రావర్సీ వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులు బాగా హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకున్నా , ఆ హీరో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా లో దారుణంగా విమర్శిస్తున్నారు ఈ బోల్డ్ బ్యూటీని. ఆ ఇంటర్వ్యూ లో రాధిక ఆప్టే మాట్లాడుతూ, తెలుగు సినీ ఇండస్ట్రీ లో తాను చాలా కష్టపడ్డాను అని, కానీ టాలీవుడ్ పరిశ్రమలో పురుషాధిక్యత వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ తెలిపింది.
అంతేకాకుండా షూటింగ్ సెట్ లో మహిళలను చూసే విధానం, వారి పాత్రలను చూపించే తీరు బలహీనంగానే ఉంటాయని అంది.

అయితే రాధికా ఆప్టే అన్న ఈ మాటలు ఒక రకంగా వాస్తవాన్ని తెలిపినా, ఈమె చేసిందే మూడు సినిమాలు అందులో ఫస్ట్ సినిమా ప్రకాష్ రాజ్ తో. ఇక మిగతా రెండు సినిమాలు చేసింది బాలయ్యతోనే అని తెలిసిందే. లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది. కేవలం ఈ సినిమాలకే టాలీవుడ్ ని నిందించింది అంటే బాలయ్యనే ఇండైరెక్ట్ గా అన్ని మాటలు అంది అని బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆమెని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సినీ ప్రేమికులు మాత్రం రెండు మూడు సినిమాలకే ఇండస్ట్రీ మొత్తాన్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని, మిగతా హీరోయిన్ల తీరు తెన్నులు కూడా తెలుసుకుని మాట్లాడాల్సిందని, కొందరు అలా ఉన్నంత మాత్రాన అందరూ ఉండరన, ఇప్పుడు దేశంలోనే టాలీవుడ్ టాప్ లో ఉందని అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు