Ram Charan: ఆ రేంజ్ అందుకునే తెలుగు హీరో వున్నారా..?

Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రాజమౌళి దర్శకత్వంలో మగధీరలో చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు.. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించి కమర్షియల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్న ఈయన గత రెండేళ్ల క్రితం మళ్లీ జక్కన్న డైరెక్షన్లో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

రామ్ చరణ్ రేంజ్ అందుకోవడం సాధ్యమేనా..

ఇక ఈ సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని చెప్పాలి.. అంతేకాదు మొదటిసారి రెడ్ కార్పెట్ పై నడిచిన తొలి తెలుగు హీరోగా కూడా రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా ఇటీవలే రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఒకదాని తర్వాత మరొక పురస్కారాలను అందుకుంటూ తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు కమర్షియల్ యాడ్స్ , అలాగే కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు.

రూ.వేల కోట్లు ఈయన సొంతం..

ఈ క్రమంలోనెవ్ తాజాగా రామ్ చరణ్ ఆస్తుల విలువ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ ఆస్తుల నికర విలువ రూ.1,370 కోట్లుగా ఉందని సమాచారం. అయితే రామ్ చరణ్ ఆదాయానికి ప్రధాన మూలం అతని నటన మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్, ఫిలిం ప్రొడక్షన్ లో కూడా పెట్టుబడి పెట్టడం వంటివి ప్రధానంగా ఉన్నాయి.. ఇక రాంచరణ్ కి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.. దీని ఖరీదు సుమారుగా రూ.38 కోట్లు ..ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు రాంచరణ్ రేంజ్ రోవర్, ఆస్టన్ మార్టిన్ వంటి అనేక లగ్జరీ కార్ లను కూడా కలిగి ఉన్నారు. ఇక తన తండ్రి సంపాదన సపరేటు.. ముఖ్యంగా తన తండ్రి ఆదాయాన్ని కూడా కలుపుకుంటే సుమారుగా రూ .3,000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇంత సంపాదన.. ఇంత ఆస్తి విలువ.. ఏ తెలుగు హీరో అందుకోలేదనడంలో సందేహం లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రూ.1600 కోట్లకు అధిపతి.. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగా రికార్డు సృష్టించారు.

- Advertisement -

రామ్ చరణ్ సినిమాలు..

ప్రస్తుతం రామ్ చరణ్ ఎస్.శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మళ్ళీ సుకుమార్ తో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా అటు ఆస్తుల పరంగా ఇటు సినిమాలలో సక్సెస్ పరంగా రామ్ చరణ్ రేంజ్ ను అందుకోవడం అసాధ్యం అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు