Kalki 2898AD : కర్ణాటక గడ్డపై కల్కి సెన్సేషనల్ రచ్చ.. భారీగా కల్కి బిజినెస్..

Kalki 2898AD : పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD మూవీ రోజురోజుకి అంచనాలను పెంచేస్తుంది. సినిమా మొదలైనప్పుడు ఉన్న అంచనాలకు తోడు సినిమా నుండి వచ్చే ఒక్కో అప్డేట్ కు పదింతలు హైప్ పెరుగుతుంది. ఇక ఈ సినిమా నుండి మొన్నామధ్య రిలీజ్ అయిన అశ్వద్దామ టీజర్ కూడా ఎంతో మంచి రెస్పాన్స్ రాబట్టుకుని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ తో ఆడియన్స్ భారీగా అంచనాలను పెట్టుకున్నారు. ఆ లుక్ ని బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్ లో VFX వర్క్ జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పై వెయ్ కోట్ల టార్గెట్ తో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున జూన్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. నిజానికి ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఎలక్షన్స్ మరియు కొంత గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇక జూన్ ఎండ్ లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఆల్ రెడీ టీం యూనిక్ వే లో ప్రమోషన్స్ ని చేస్తూ ఉండగా, ఇంకా సాంగ్స్, ట్రైలర్ లు లాంటివి రిలీజ్ కాకుండానే సినిమా మీద బజ్ రోజు రోజుకి పెరిగి పోతూ ఉండగా బిజినెస్ ఆఫర్స్ భారీ లెవల్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

భారీ ఆఫర్ల తో రచ్చ..

ఇక ప్రభాస్ కల్కి (Kalki 2898AD) సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా సెన్సషనల్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలలోని ఈ సినిమా 200 కోట్ల బిజినెస్ చేయనుండగా, నార్త్ లో మరో 150 కోట్లకి పైగా బిజినెస్ ని జరుపుకోనుంది. ఇక తమిళనాట కమల్ హాసన్ ఉండడం వల్ల అక్కడ కూడా ఓ రేంజ్ లో బిజినెస్ జరుగనుంది. కానీ ఇంకా కమల్ కి సంబంధించిన లుక్ ఏమి రిలీజ్ కాలేదు కాబట్టి, టీజర్ రిలీజ్ అయ్యాక మరింత హైప్ పెరుగుతుంది కాబట్టి, అప్పుడు తమిళనాడు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కి ఇటు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అన్ని చోట్లా సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుండగా, ప్రభాస్ గత సినిమాలకి మించి ఓ రేంజ్ లో రచ్చ చేస్తుందని చెప్పాలి. అది కూడా రిలీజ్ కి మూడు నెలల ముందునుంచే ఈ బిజినెస్ లో సాలిడ్ రికార్డులు క్రియేట్ చేస్తూ భారీ ఆఫర్లు అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా కల్కి మూవీ కి పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.

కర్ణాటకలో భారీ రికార్డు..

ఇక కర్ణాటకలో కల్కి కి ప్రభాస్ గత సినిమాలని మించి ఆఫర్లు వస్తున్నాయట. మేకర్స్ భారీ రేట్స్ ను కోట్ చేసినా కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ రేట్లను కోట్ చేస్తూ ఉండటం విశేషం. దాదాపు కర్ణాటకలో రిలీజ్ చాలా రోజుల ముందే 22-25 కోట్ల మధ్యలో బిజినెస్ ఆఫర్స్ ని కల్కి మూవీ సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక మేకర్స్ దాదాపు 30 కోట్ల రేంజ్ రేటుని ఎక్స్పెర్ట్ చేస్తూ ఉండగా ఫైనల్ గా డీల్ కొంచం అటూ ఇటూగా క్లోజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన చోట్ల కూడా సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుండగా, కల్కి మూవీ ఈ ఇయర్ రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటి అవ్వడంతో ఏ మాత్రం అంచనాలను అందుకునే టాక్ వచ్చినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక త్వరలోనే సినిమా నుండి టీజర్, ట్రైలర్ లు రిలీజ్ రిలీజ్ అయ్యాక సినిమా మీద బజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక కల్కి మూవీ దాదాపు వరల్డ్ వైడ్ గా 450 నుండి 550 కోట్లకి పైగా థియేట్రికల్ బిజినెస్ ను జరుపుకుని అవకాశం ఉందని చెప్పాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు