Gaami movie trailer talk : స్పర్శ కోసం ఆరాటం.. ‘మాలి’ కోసం పోరాటం..

అఘోర గా విశ్వక్ సేన్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “గామి” థియేట్రికల్ ట్రైలర్ ఫైనల్ గా వచ్చేసింది. విశ్వక్ సేన్ తన మాస్ జోనర్ ని వదిలి సరికొత్త కథాంశంతో ట్రై చేసిన సినిమాయే “గామి”. విద్యాధర్ దర్శకత్వం లో కార్తీక్ శబరీష్ నిర్మించిన “గామీ” చిత్రంలో విశ్వక్ సేన్ శంకర్ గా నటించగా, చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా జాహ్నవి అనే పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే భారీ అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా గామి పాత్రల్ని చూపిస్తూ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. దాంతో గామి సినిమాతో ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీని అందించబోతున్నారని తెలిసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

- Advertisement -

ఇందులో శంకర్ అనే పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్ ని , ట్రైలర్ లో ఇంకా తన పేరు కూడా తెలియని వ్యక్తిగా చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఒక మానవ స్పర్శను కూడా అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అఘోర గా విశ్వక్ సేన్ ని చూపించారు మేకర్స్. ఇక ఆ వ్యాధికి పరిష్కారంగా హిమాలయాల శిఖరాగ్రాన ఉన్న ద్రోణగిరి పర్వతం పై ప్రతి 36 సంవత్సరాలకి వచ్చే వైద్ర తిథి నాడు స్వయం ప్రకాశాలైన మాలి పత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో తనకున్న సమస్య ను తొలగిస్తాయి అని ఒక స్వామిజి చెప్పినట్టు చూపిస్తారు. ఈ వ్యాధిని నయం చేసుకోవడానికి శంకర్ చేసే ప్రయాణంలో తనకి తోడుగా ఉన్న జాహ్నవి ఎవరు? ఇంతకీ ఆ వ్యాధి తనకే ఎందుకు వచ్చింది? ఈ కథ మధ్యలో దుర్గ ఎవరు? చీకటి గదిలో ఉన్న వ్యక్తులెవరు? ఫైనల్ గా శంకర్ పోరాటం ఫలించిందా లేదా అన్నది తెలియాలంటే మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాలి.

అద్భుతమైన నిర్మాణ విలువలు :

గామి సినిమాకు మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్ గా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో కొన్ని షాట్స్ vfx అయినా కూడా ఎంతో రియలిస్టిక్ గా తీశారు. ఇక సైన్స్ కి పురాణాలకి లింక్ చేయడం బాగుంది. ట్రైలర్ కట్ కూడా పర్ఫెక్ట్ గా తీశారు. కాకపోతే ట్రైలర్ లోనే స్టోరీ మొత్తం చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కి కనెక్ట్ అయితే చాలు. ఇక సినిమాలో స్టోరీయే ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో నరేష్ కుమారన్ బీజీఎమ్ కూడా బాగుంది. ఇదే రేంజ్ లో మూవీలో అవసరమైన చోట మంచి బీజీఎమ్ ఇస్తే చాలా ప్లస్ అవుతుంది. ఇక డిఒపి విశ్వనాధ్ పనితనం కూడా బాగుంది. అన్నిటికి మించి హిమాలయాస్ జర్నీ సీన్స్ ని ట్రైలర్ లో బాగా చూపించాడు.
ఇక దర్శకుడు విద్యాధర్‌ నాలుగేళ్ల పాటు గామి కోసం చాలా రీసెర్చ్‌ చేయగా, నాలుగేళ్లుగా సినిమా కోసం పనిచేశానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ కష్టం ట్రైలర్ లో కనిపించినట్టే ఉంది. మరి ఈ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుందా? విశ్వక్ సేన్ గామి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొడతాడా అనేది తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక గామి సినిమాను శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు