Sai Rajesh : మెగా హీరోలతో సినిమా చేస్తే.. ఇక మన చేతుల్లో సినిమా ఉండదు.. బేబీ డైరెక్టర్

Sai Rajesh : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో సాయి రాజేష్ ఒకరు. ఇండస్ట్రీ లో చాలా ఏళ్ల నుండి ఉన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన ‘బేబీ’ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ ఎక్కువగా పాపులర్ అయ్యాడు. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ లాగా అన్నట్టు వచ్చిన బేబీ సినిమా అనూహ్యంగా సంచలన విజయం సాధించింది. అయితే అంతకు ముందు హృదయకాలేయం, కొబ్టరి మట్ట వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో సంపూర్ణేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ పొట్ట చెక్కలు చేసిన, సాయి రాజేష్ ప్రేక్షకుల్ని అలరించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ 2020 లో ‘కలర్ ఫొటో’ చిత్రంతో కాస్త ఎక్కువ గుర్తింపుని పొందారు. ఈ చిత్రంతో జాతీయ అవార్డుని అందుకున్నారు. అనంతరం.. ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని యూత్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. నిజానికి ఇది అంత గొప్ప సినిమా ఏమి కాకపోయినా, ప్రేక్షకులు మాత్రం భారీ విజయాన్ని పట్టం గట్టారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి రాజేష్ మెగా హీరోలపై, ఇతర స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

మెగా హీరోలతో చేయలేనేమో?

ఇదిలా ఉండగా దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని మాత్రమే కాకుండా, మెగా ఫ్యాన్ దర్శకుడనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ తరుఫున ప్రచారం చేస్తున్నాడు సాయి రాజేష్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో ఇంతవరకూ మెగా హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి గల కారణాల్ని చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూ లో సాయి రాజేష్ మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లెక్కే కానీ.. పెద్ద హీరోలతో సినిమా అంటే.. వాళ్లు ఛాన్స్ ఇవ్వాలి. నిజానికి నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలని మైండ్ సెట్ లేదు. ఎందుకంటే నాకు రియాలిటీ ఏంటో తెలుసు.. నేను చేశాను. వాళ్లు సెట్‌లోకి వస్తే.. వాతావరణం మొత్తం మారిపోతుంది. సినిమా మన చేతుల్లో ఉండదనే భయం ఉంది. ఎందుకంటే అభిమానం అలాంటిది, తమ అభిమాన హీరోతో చేయాలంటే ఖచ్చితంగా భయమేస్తుంది. అందుకే సినిమా వాళ్ళతో చేయలేమని అంటూనే, కానీ మా ప్రొడ్యుసర్ ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ సినిమా స్టార్ హీరోతో చేయాలని అంటున్నారని అన్నాడు.

నిజాలను బయటకు చెప్తే ఏముంది?

అయితే ఇలా ఓపెన్ గా చెప్తే ఎలా అని విలేఖరి అడిగితే, దానికి సాయి రాజేష్ వివరణ కూడా ఇలా ఉంది. నిజాలను బయటకు చెప్తే, ఓపెన్ గా చెప్తే ఏముంది? నాకు ఎలాగూ సంపూతో సినిమాలు చేయడం వచ్చు. మళ్లీ అవే చేసుకుంటా. నాకు పైకి వెళ్లాలనేది ఏం లేదు. కడుపు నిండితే చాలు. ఇక ఛాన్స్‌ల పరంగా, హీరోలు దొరకలేకే హృదయకాలేయం లాంటి సినిమాలు చేశానన్నాడు. కానీ ఇవి చేశాక మొత్తం పోయాయి. ఎట్టాగూ మనకి హీరో రారు.. ఎవరైనా చిన్న హీరోతో చేద్దాం అని సుహస్ తో చేశా. ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిందని అన్నాడు. ఇక కలర్ ఫొటో గురించి మాట్లాడుతూ, కలర్ ఫొటో నాది నా భార్య రియల్ స్టోరీనే అని, లవ్‌లో ఉన్న రియాలిటీ ఏంటో చూపించాలని అనుకున్నా, సినిమాటిక్‌గా అయితే.. ఆ అమ్మాయి చెప్పిన దానికి హీరో కన్వెన్స్ అవ్వాలి. కానీ రియాలిటీలో లవర్స్ అలా ఉండరు. కానీ సినిమాలో రియాలిటీ ఉంటుంది. ప్రేమ అనేది జెన్యూన్‌గానే ఉంటుంది. అదే చూపించాలని అనుకున్నా అని అన్నాడు. ఇక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నానని, ఈ రెండూ బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతాయని చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు సాయి రాజేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు