Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అరుదైన గొప్ప ఆహ్వానం.. ఐక్యరాజ్య సమితి నుండి..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకుని పవర్ స్టార్ గా ఎదిగాడు. తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న సందేశం ఉండేలా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పాటలో అయినా, యూత్ ఇన్స్పైర్ అయ్యేలా ఏదో ఒక అంశంపై సందేశాన్ని ఇస్తుంటాడు. ఇలాంటి వాటి వల్లే ప్రేక్షకుల్లో మరింత ఎత్తుకు ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరికీ కష్టం వచ్చినా మెగా ఫ్యామిలీ ముందుంటుందనడం లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సాయం ప్రజల్లోనూ వెళ్లి చేయాలనీ నిశ్చయించుకున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ తన వంతు సాయం ప్రజలకు చేస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి తాజాగా అభిమానులు సంతోషించే వార్త వచ్చింది.

పవన్ కు ఐక్యరాజ్య సమితి నుండి అరుదైన ఆహ్వానం..

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు అయిన పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజషన్స్) నుంచి ఆహ్వానం వచ్చింది. మే 22వ తేదీన జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలని ఆ ఆహ్వానంలో ఉంది. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొని ప్రసంగించ‌నున్నారు. ఇక భారతదేశం తరఫున ఈ ఏడాది ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉందని.. అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కిందని తెలిసింది. ఇక ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడం కోసం మే 20న పవన్ కల్యాణ్ న్యూయార్క్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే దేశం తరఫున కృషి చేస్తున్న నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందట. అలా ఆ నలుగురిలో పవన్ కల్యాణ్ కు అవకాశం వచ్చినట్లు తెలిసింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికలు ఫలితాల కంటే ముందుగానే..

ఇక ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మే 11 సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అయితే మే 13 నుంచి జూన్ 3 వరకూ రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల ఫలితాల గురించి ఉత్కంఠతోనే కాస్త విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ కు మే 20న వెళ్తారని తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాల ముందే పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి కి వెళ్లడం యాధృచ్చికమే అయినా, వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే, ఆయన పేరు ఇంటర్నేషనల్ వైడ్ గా వినబడుతుందనడం లో అనుమానం లేదు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు