Nepo Kids: బోలెడు బ్యాగ్రౌండ్.. సక్సెస్ కి మాత్రం నోచుకోని లేడీ క్వీన్స్..!

Nepo Kids..సినీ ఇండస్ట్రీలో ఒక్కరు సక్సెస్ అయ్యారంటే చాలు వారి కుటుంబం నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా.. మరి కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. ముఖ్యంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఫెయిల్యూర్ అయిన హీరోయిన్స్ గురించి పూర్తిగా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Nepo Kids: Lots of background.. Lady queens who don't see success..!
Nepo Kids: Lots of background.. Lady queens who don’t see success..!

నిహారిక కొణిదెల:

ముఖ్యంగా ఇలాంటి లిస్టులో మెగా ఫ్యామిలీ నుంచి ఎన్నో అవకాశాలు దక్కించుకున్న నిహారిక కొణిదెల మొదటి వరుసలో ఉంటుంది.. భారీ బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు అందుకుంది కానీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం.

సుప్రియ:

అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా ఎంతో బ్యాక్ గ్రౌండ్ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా.. ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే నిర్మాతగా కూడా ముందుకు వెళ్తోంది.

- Advertisement -

మంచు లక్ష్మి..

మంచు ఫ్యామిలీ నుంచి యాక్టర్ గా , హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనిపించుకుంది కానీ నటిగా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్..

జీవిత , రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. శివాని, శివాత్మిక.. వీరిద్దరూ డాక్టర్లే అయినప్పటికీ హీరోయిన్ అవ్వాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. అందుకు తగ్గట్టు అవకాశాలు వస్తున్నాయి కానీ స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. దీంతో వచ్చిన పాత్రలలో చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు మరొకవైపు గ్లామర్ షో చేస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

అక్షర హాసన్..

కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.. అవకాశాల కోసం ఇప్పటికి ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈమె అక్క శృతిహాసన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ఘట్టమనేని మంజుల..

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా ఘట్టమనేని మంజుల హీరోయిన్ గా మొదట ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆమెకు పెద్దగా హీరోయిన్ పాత్ర వర్కౌట్ కాలేదు.. గతంలో కూడా బాలయ్యతో హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ కృష్ణ అభిమానులు నానా రచ్చ చేయడంతో అలా సినిమా నుంచి తప్పుకుంది.

వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు.అయితే ఈ హీరోయిన్స్ ఫెయిల్యూర్ కి మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియడం లేదు.. మరి రాబోయే రోజుల్లోనైనా సరైన కథలను ఎంపిక చేసుకొని మళ్లీ పలు సినిమాలలో నటించి తమ టాలెంట్ తో పైకి ఎదుగుతారేమో చూడాలి మరి. మొత్తానికి అయితే భారీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా సరైన సమయంలో అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో వీరందరూ ఫెయిల్యూర్ అయ్యారనటం లో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు