Hari Kumar : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ మలయాళ దర్శకుడి కన్నుమూత..

Hari Kumar : సినిమా ఇండస్ట్రీ లో గత కొంత కాలంగా విషాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే మరాఠీ లో ప్రముఖ దర్శక నటుడు క్షితిజ్ జారప్కర్ మరణించగా, ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు చనిపోవడం జరిగింది. ప్రముఖ మలయాళ దర్శకుడు హరికుమార్ తాజాగా మే 6న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందడం జరిగింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిన హరికుమార్ మలయాళ చిత్రసీమలో దర్శకుడిగా సుదీర్ఘ ప్రయాణం సాగించారు. 70 ఏళ్ళ వయసున్న హరి ప్రసాద్ అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ లో చేరగా, నిన్న సాయంత్రం ఆయన మరణించారు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరి కుమార్ కెరీర్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమకు సేవలు అందించగా, 1981లో ‘అంబల్ పూవు’ తో దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేశారు. ఇక రీసెంట్ గా అతని చివరి చిత్రం ‘ఆటోరిక్షాకారంటే భార్య’ 2022 చివరలో విడుదలైంది.

దర్శకుడిగా ఎన్నో మైలు రాళ్లు..

దర్శకుడు హరికుమార్ (Hari Kumar) అర్ధవంతమైన, లాభదాయకమైన చిత్రాలను రూపొందించాలనే లక్ష్యంతో ఎన్నో విభిన్నమైన చిత్రాలను లౌ బడ్జెట్ తో తెరకెక్కించారు. మమ్ముట్టి, మోహన్ లాల్ లతో పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇక అతని లో ఉత్తమ రచన మాత్రం సుకృతం సినిమా అని అందరూ అంటారు. 1994లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక సుకృతం అనేది అంత సాధారణం కాని కథనంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాకు M.T వాసుదేవన్ చక్కటి స్క్రిప్ట్ అందించారు. ఇక వాసుదేవన్ నాయర్ మరియు మమ్ముట్టి, గౌతమి, మనోజ్ కె. జయన్ మరియు శాంతి కృష్ణ వంటి ప్రతిభావంతులైన తారాగణం నటించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించగా, దర్శకుడిగా హరికుమార్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక జాన్సన్ స్వరపరిచిన పాటలకు సుకృతం సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత విభాగం లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా పాటలను బాంబే రవి ట్యూన్ చేశారు.

మలయాళంలో అభిరుచి గల దర్శకుడు..

ఇక మలయాళంలో కేవలం 18 సినిమాలే తీసినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు హరికుమార్. ముఖ్యంగా ఈయన సినిమాలు సంగీత పరంగా పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో జలకం, ఊజం, ఎళున్నల్లత్తు మరియు పనీనీర్ వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే అతను సుకృతం వంటి క్లాస్‌ సినిమాలా మళ్ళీ సినిమా చేయలేదని అంటుంటారు. కానీ ఉద్యానపాలకన్ మరియు స్వయంవరపంథాల్ వంటి అతని రచనలు ప్రముఖంగా పాపులర్ అయ్యాయి. పెయింటింగ్ ప్రాడిజీ యొక్క చిన్న జీవితం ఆధారంగా రూపొందించబడిన క్లింట్ వంటి చిత్రాల ద్వారా అతను విభిన్న ఇతివృత్తాలను అన్వేషించడం కొనసాగించాడు.
ఇక హరికుమార్ రెండు సందర్భాలలో జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ విభాగంలో గెలుచుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు