Samantha: ప్రైవేట్ ఫోటోలపై సామ్ కీలక వ్యాఖ్యలు..!

Samantha.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు.. దాదాపుగా 8 ఏళ్ల పాటు సమంత తన స్టార్ డం ను కొనసాగించిందని చెప్పవచ్చు.. అయితే ఎప్పుడైతే అక్కినేని ఇంటి కోడలు అయ్యిందో సమంత అప్పటినుంచి నెమ్మదిగా సినిమాలు చేస్తోంది.. నాగచైతన్యను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న సమంత అప్పటినుంచి ఇప్పటివరకు నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తోంది. ముఖ్యంగా చైతన్యతో విడిపోయినప్పటి నుంచి కూడా సమంత పైన చాలామంది నెగటివ్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

Samantha: Sam's key comments on private photos..!
Samantha: Sam’s key comments on private photos..!

ఇంస్టాగ్రామ్ లో అలాంటి ఫోటోలు..

సమంత ఎలాంటి పని చేసినా కూడా రోజు ఏదో ఒక విషయంలో ఈమె పేరు వైరల్ గా మారుతోంది. సమంత కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా తన సమయాన్ని గడిపేస్తూ ఉన్నది. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆవిరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా ఫోటోలను సైతం షేర్ చేసింది.. ఆ తర్వాత బాత్ డబ్ లో సెమి నెక్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేసింది .. అయితే అలా షేర్ చేసిందో లేదో వెంటనే డిలీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది..

ప్రైవేట్ ఫోటోలపై క్లారిటీ..

అయితే గతంలో కూడా సమంత తన ఆరోగ్యానికి ట్రీట్మెంట్ కి సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండేది.. ఇప్పుడు కూడా సమంత అలాగే చేసిందంటూ అభిమానులు ఈ ఫోటోలను చూసి చాలా ఫైర్ అయ్యారు.. కానీ ఈ విషయాలపై సమంత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.. నిజానికి అలాంటిదేమీ లేదని కొంతమంది కావాలని ఫేక్ వీడియోలను ఇలా సృష్టించి సమంతా పెట్టి డిలీట్ చేసిందనే విధంగా ప్రచారం చేస్తున్నారంటూ సమంత తెలియజేసింది.. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల సమంత ఒక కొటేషన్ ని కూడా షేర్ చేయడం జరిగింది.. ఆ కొటేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోంది.

- Advertisement -

నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

సమంత ఇలా రాసుకోస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండానే జీవించడమే అసలైన విజయం అంటూ కూడా ఇంగ్లీషులో రాసుకుంది సమంత.. సమంత చేసిన ఈ వాక్యాలకు తాను కాదని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసింది..

సమంత సినిమాలు..

సమంత ప్రస్తుత చిత్రాల విషయానికి వస్తే.. సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లతోపాటు.. మా ఇంటి బంగారం అనే మరొక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది సమంత. ప్రస్తుతమైతే సమంత సినిమాలను తగ్గించి కేవలం తన ఆరోగ్యం విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఏదేమైనా భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈమె ఏం చేసినా సరే అది కాంట్రవర్సీగా మారుతూ ఉండడం గమనార్హం మరి ఇకనైనా సమంత ఈ విషయాలకు చెక్ పెడుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం ఆరోగ్యం పైన దృష్టి పెడుతూనే మరొకవైపు మంచి కం బ్యాక్ ఇవ్వాలని కథలు వింటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు