Pawan Kalyan : ‘మా’ రాజకీయాలు పక్కన పెట్టి… ఏపీ కోసం పవన్‌కు సపోర్ట్

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ నేపథ్యంలో వార్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సీనియర్ నటుడు నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మా రాజకీయాలను పక్కన పెట్టి ఏపీ కోసం పవన్ కు సపోర్ట్ చేయాలంటూ సినీ సోదరులకు పిలుపునిచ్చారాయన.

పవన్ కు సపోర్ట్ గా..

సేనియర్ నటుడు నరేష్ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఆసక్తికర ట్వీట్ వేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక టార్చ్ బేరర్ లాంటివాడనేది వాస్తవం అంటూ గత పాలకులు తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన నష్టాన్ని భర్తీ చేయగలిగేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని ట్వీట్ చేశాడు నరేష్. టిడిపి, జనసేన, బిజెపి కూటమి భారీ మెజారిటీతో గెలవాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తన సపోర్ట్ ను బహిరంగగానే వెల్లడించాడు ఈ సీనియర్ నటుడు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా, ఒక సీనియర్ నటుడిగా సినీ పరిశ్రమ అంతా ఒక తాటిమీద ఉండాలని వేదికగా పిలుపునిచ్చాడు.

ఇక ఈ విషయంలోకి మెగాస్టార్ చిరంజీవిని కూడా లాగుతూ ఆయన గతంలో చెప్పినట్టుగానే మంచి ఉంటే మైక్ లో మాట్లాడుకుందాం అని, చెడును చెవిలో చెప్పుకుందాం అంటూ ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారారు. అంతేకాకుండా ఆయన తన ట్వీట్ కి కామెంట్స్ ఆఫ్ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

- Advertisement -

కృష్ణ విషయంలో పవన్ పై సీరియస్..

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తనకు పోటీగా కృష్ణ సినిమాలు చేసినప్పటికీ తొక్కేయాలని చూడలేదని, కానీ ప్రస్తుతం పోటీగా వస్తున్నాను అనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ తనను తొక్కేయాలని చూస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ విషయం గురించి నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కృష్ణ ఒక మహానుభావుడని, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ మాటలు బాధించాయని అంటూనే ఏదేమైనా సరే ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గెలిస్తేనే బాగుంటుందని, అతనే ఏపీకి భవిష్యత్తు అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.

‘మా’ రాజకీయాలు పక్కన పెట్టి..

ఇక ‘మా’ అధ్యక్షుడి ఎన్నికల్లో గతంలో నరేష్ టీంకు మెగా అండ దక్కలేదు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవితో పాటే పవన్ కళ్యాణ్ కూడ సపోర్ట్ చేశారు. ఇక నరేష్ మాత్రం వాళ్ళకు వ్యతిరకంగా మంచు విష్ణుకు సపోర్ట్ చేశాడు. మొత్తానికి ఈసారి కూడా మంచు విష్ణు ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మాలో నెలకొన్న విబేధాలను పక్కన పెట్టి నరేష్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు