Selvaraghavan : ఆ సినిమా 50 సార్లు చూసానన్న సెల్వరాఘవన్.. దర్శకుడు ఎవరో తెలుసా?

Selvaraghavan : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నాడు. ఇక ఈ దర్శకుడు ఆ మధ్య ధనుష్ తో నానే వరువన్ సినిమా తీసి ప్లాప్ ని అందుకోగా, త్వరలో యుగానికి ఒక్కడు సీక్వెల్ తీస్తానని ప్రకటన ఇచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలైతే చేయలేదు. అయితే ధనుష్ తీస్తున్న రాయన్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నటుడుగా కూడా సెల్వరాఘవన్ సక్సెస్ అయ్యాడని తెలిసిందే. రెండేళ్ల విజయ్ బీస్ట్ సినిమాలో కీలక పాత్రలో నటించగా, లాస్ట్ ఇయర్ బకాసురన్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ గా నటించి మెప్పించాడు. ఇక ఈ ఇయర్ తెలుగులో రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటిస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా దర్శకుడిగా బిజీ కాకపోయినా నటుడుగా బిజీ అయి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటున్నాడు సెల్వ. తాజాగా సోషల్ మీడియా లో ఓ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలని పంచుకున్నాడు.

ఆ సినిమా 50 సార్లు చూసా – సెల్వ రాఘవన్

తాజాగా సెల్వరాఘవన్ ఓ పాత మలయాళ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. 1993 లో మలయాళం లో మోహన్ లాల్, సురేష్ గోపీ, శోభన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “మణిచిత్రతాఝు”. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తాజాగా సెల్వ రాఘవన్ సోషల్ మీడియా లో ట్వీట్ వేయడం జరిగింది. సెల్వ రాఘవన్ ఆ చిత్రం గురించి ప్రస్తావిస్తూ, “మణిచిత్రతాఝు”. నేను దాదాపు 50 సార్లు చూసిన సినిమా! ఫాజిల్ సర్ నుండి ఒక క్లాసిక్. దానికి శోభన అద్భుతమైన అభినయం. ఆ పాత్రకు ఆమెకు జాతీయ అవార్డు లభించింది. అలాగే మోహన్‌లాల్ సార్ మన జాతీయ గర్వం, అని ట్వీట్ వేసాడు. ఇక ఈ సినిమా 31 ఏళ్ళ కింద వచ్చి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమానే కన్నడ స్టార్ విష్ణువర్ధన్ ఆప్త మిత్ర పేరుతో తెరకెక్కించి హిట్ కొట్టగా, సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి పేరిట రీమేక్ చేసారు. ఈ రెండింటిని పి. వాసు దర్శకత్వం వహించగా, ఆ తర్వాత ఈ సినిమానే మళ్ళీ తీసి డిజాస్టర్ అందుకున్నాడు.

మణిచిత్రతాఝు డైరెక్టర్ గురించి తెలుసా?

ఇక “మణిచిత్రతాఝు” సినిమా ప్రముఖ కన్నడ దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించగా, ఈ దర్శకుడు ఎవరో కాదు ప్రస్తుత మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ తండ్రి. అంతే కాదు 1992 లో నాగార్జున తో తెలుగులో కిల్లర్ పేరుతో సినిమా కూడా తీసాడు. మలయాళంలో ఎన్నో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు మలయాళ ఇండస్ట్రీ ని కమర్షియల్ గా ఎదగడానికి దోహదపడ్డాడు. ఇక ఈ మధ్య సినిమాలు తీయడం ఆపేసాడు కానీ, ఒకప్పుడు ఈయన తీసిన స్టైల్ అఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇప్పుడు మలయాళీ దర్శకులు మళ్ళీ తెరకెక్కించి హిట్లు కొడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు