Fahadh Faasil : నా సినిమాల్లో దాన్ని మాత్రం టచ్ చేయను… ఫ్లాప్ మూవీపై ఫహాద్ కామెంట్స్

Fahadh Faasil : మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ తన సినిమాలలో మతాన్ని మాత్రం టచ్ చేయను అంటూ తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన నటించిన గత చిత్రాన్ని గుర్తు చేస్తూ మతానికి సంబంధించిన సినిమాల విషయంలో పెట్టుకున్న కొత్త రూల్స్ ను వెల్లడించారు.

మతాన్ని మాత్రం టచ్ చేయను..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహద్ మాట్లాడుతూ కేరళలోని ప్రజలు కఠినమైన వాస్తవాన్ని వినడానికి సిద్ధంగా లేరంటూ తన గత ఫ్లాప్ చిత్రం ‘ట్రాన్స్’ గురించి ప్రస్తావించారు. ఆ చిత్రం ఎందుకు కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది అనే విషయాన్ని వివరించారు.

ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ నటించిన ‘ట్రాన్స్’ మూవీలో కేరళలోని ఓ మతాన్ని ఉద్దేశిస్తూ తీసిన చిత్రం. తాజా ఇంటర్వ్యూలో మతం ఒక అగ్రస్థానంలో ఉందని, దానిని మళ్లీ తాకనని ఫహద్ చెప్పాడు. తన నిర్ణయాన్ని వివరిస్తూ “కేరళలో మతంతో వ్యవహరించడం గురించి నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రజలు కఠినమైన వాస్తవాన్ని నేను చెబితే వినాలని అనుకోను. వారు కేవలం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు” అని అన్నారు ఫహద్.

- Advertisement -

ఎడిటింగ్ వల్ల అసలు స్టోరీ మిస్

‘ట్రాన్స్’లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ లేదు. అవగాహన వంటి అంశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ తో సహా చాలావరకు సినిమాను ఎడిట్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా నుండి ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ ను తీసేశారు. అక్కడే మేము విఫలమయ్యాము అన్నారు ఫహద్. ముందుగా అనుకున్న స్టోరీకి, థియేటర్లలోకి వచ్చిన ‘ట్రాన్స్’కు చాలా తేడా ఉంది. కానీ నేను మళ్ళీ సినిమాల్లో మతాన్ని టచ్ చేయను” అంటూ క్లారిటీ ఇచ్చారు ఈ మలయాళ హీరో.

ఫహాద్ ఫ్లాప్ మూవీ..

‘ట్రాన్స్’ అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌. ఇందులో ఫహద్ ఫాసిల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, దిలీష్ పోతన్, నజ్రియా నజీమ్, చెంబన్ వినోద్ జోస్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అయితే అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ సాధించలేదు.

సెన్సార్ సమస్యలు..

అప్పట్లో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపడంతో ‘ట్రాన్స్’ చాలాసార్లు వాయిదా పడింది. CBFC అనేక కట్స్ సూచించింది. కానీ మేకర్స్ వాటికి అంగీకరించలేదు. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ట్రాన్స్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మతం ముసుగులో ఎలా డబ్బులు సంపాదిస్తారు? ఎలా కోటీశ్వరులు అవుతారు? అనే విషయాలను ఈ మూవీలో చూపించారు.

ఫహాద్ నెక్స్ట్ సినిమాలు…

కాగా ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆవేశం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఫహద్ నెక్స్ట్ ‘పుష్ప: ది రూల్’, ‘వెట్టయన్’, ‘మారీసన్’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆవేశం మూవీతో నిర్మాతగా కూడా మంచి లాభాలు అందుకున్నాడు ఈ హీరో. అలాగే రీసెంట్ హిట్ మూవీ ప్రేమలుకు కూడా ఫహాద్ ఫాసిల్ నిర్మాత కావడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు