Tamannah Bhatia : చిక్కుల్లో పడ్డ మిల్క్ బ్యూటీ… సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

Tamannah Bhatia : స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా ఓ యాడ్ కారణంగా చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ బ్యూటీని విచారణకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసిందని, దానికి ప్రమోటర్ గా ఉన్న తమన్నా కూడా విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. తమన్నా చేసిన పనికి కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు తమన్నాకు నోటీసులు జారీ చేశారు.

ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను వయాకామ్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళ ఫిర్యాదు నేపథ్యంలోనే మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఫెయిర్ ప్లే యాప్ టాటా ఐపీఎల్ 2023ని చట్టవిరుద్ధంగా ప్రదర్శించిన కారణంగా తమకు 100 కోట్ల భారీ నష్టం వాటిలిందని వయా కంప్లైంట్ చేసింది. డిసెంబర్ 2023లో ఈ బెట్టింగ్ యాప్ కు చెందిన ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత అతని నుంచి సమాచారం రాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి తమన్నా విచారణకు హాజరు కావాలని సమన్లు పంపారు.

తమన్నాకు దీంతో సంబంధం ఏంటి అంటే? ఈ మిల్కీ బ్యూటీ ఫెయిర్ ప్లే యాప్ ను ప్రమోట్ చేసిందని, కాబట్టి సాక్షిగా విచారణకు రావాలని ఆదేశించినట్టుగా సమాచారం. ఇక ఈ కేసులోనే బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, బాలీవుడ్ రాపర్ బాద్షా కూడా ఇరుక్కున్నారు.

- Advertisement -

తమన్నాను ఈ ప్రశ్నలు అడగొచ్చు

ఫెయిర్‌ప్లేను ప్రమోట్ చేయడానికి ఆమెను ఎవరు సంప్రదించారు? ఈ యాప్ ను ప్రమోట్ చేయడం కోసం ఆమె ఎంత డబ్బు తీసుకుంది? ఏఏ మార్గాల ద్వారా రెమ్యూనరేషన్ అందుకుంది? అనే విషయాలను సైబర్ పోలీసులు తమన్నా నుండి తెలుసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.

సంజయ్ దత్‌ గైర్హాజరు

ఏప్రిల్ 23న ఇదే కేసులో నటుడు సంజయ్ దత్‌ను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే సంజయ్ తాను ముంబైలో లేనని, చెప్పిన తేదీకి హాజరు కాలేనని చెప్పాడు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి కొత్త తేదీ, సమయాన్ని ఇవ్వమని కోరాడు.

బాద్ షా స్టేట్మెంట్

ఈ కేసులో రాపర్ బాద్ షా వాంగ్మూలాన్ని సైబర్ సెల్ ఇప్పటికే నమోదు చేసింది. అతను ఫెయిర్‌ప్లే యాప్‌ను ప్రమోట్ చేశాడని, అంతకుమించి ఇంకేమీ తెలియదని అతని తరపు న్యాయవాది చెప్పారు.

సెలబ్రిటీల ఖాతాల్లో దుబాయ్ కంపెనీ నుంచి డబ్బు..

ఈ కేసు విచారణలో ఫెయిర్‌ప్లే వివిధ కంపెనీల ఖాతాల నుంచి సెలెబ్రెటీలకు డబ్బులు చెల్లించినట్లు పోలీసులకు తెలిసింది. సంజయ్ కురాకోలో ఉన్న ప్లే వెంచర్ అనే కంపెనీ ఖాతా నుంచి డబ్బును పొందగా, బాద్షా లైకోస్ గ్రూప్ ఎఫ్‌జెడ్‌ఎఫ్ కంపెనీ ఖాతా నుంచి డబ్బు పొందాడు. ఈ కంపెనీ దుబాయ్‌కి చెందినది. మరోవైపు ట్రిమ్ జనరల్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సి అనే కంపెనీ ఖాతా నుండి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డబ్బు పొందారు. ఈ కంపెనీ కూడా దుబాయ్‌దే కావడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు