Ranveer Singh Prashanth Varma Movie : 20 రోజుల ముందే చెప్పింది నిజమైంది… రణవీర్ – ప్రశాంత్ వర్మ మూవీకి ప్రొడ్యూసర్ ఫిక్స్ ?

Ranveer Singh Prashanth Varma Movie : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు దేశం మొత్తం సినీ ఇండస్ట్రీ లో మార్మోగిపోతోంది. “అ” అనే చిన్న సినిమాతో ప్రారంభమైన ప్రశాంత్ వర్మ సినీ ప్రయాణం అసలైన ఊపందుకుంది “హనుమాన్” చిత్రం తోనే. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలుపెట్టాడో కానీ, ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సత్తా ఏంటో నేషనల్ వైడ్ గా చాటింది “హనుమాన్” చిత్రం. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకి విపరీతంగా నచ్చేసింది మన హనుమాన్ మూవీ. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో నార్త్ లో కూడా మంచి పేరు సంపాదించాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ తీయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా హనుమాన్ సినిమా తర్వాత టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్లు ప్రశాంత్ వర్మతో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. అంతకు మించి స్టార్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో చేయబోతున్నాడని 20 రోజుల కింద filmify నుండి సమాచారం అందింది. ఇప్పుడు ఆ వార్తే నిజమయింది. త్వరలోనే రణవీర్ సింగ్ తో వర్మ ప్రయాణం మొదలుకానుంది.

జై హనుమాన్ హోల్డ్ లో పెట్టి రణవీర్ తో..

అయితే హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ఏ సినిమా చేస్తాడని నెటిజన్లు అనుకోగా, రిలీజ్ కి ముందు తాను అంతకు ముందే అనౌన్స్ చేసిన ‘అధిర’ సినిమా ప్రారంభిస్తాడని అనుకున్నారు అందరు. అయితే హనుమాన్ రిలీజ్ అయ్యాక “జై హనుమాన్” సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని మొదట్లో ప్రశాంత్ వర్మ కూడా అన్నాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో సినిమా చేయనున్నాడట. అయితే జై హనుమాన్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో ఈ లోపు రణవీర్ సింగ్ తో కొత్త కథతో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక జై హనుమాన్ కంటే ముందే కనీసం రెండు సినిమాలు చేయాలని ప్రశాంత్ వర్మ అనుకున్నారట. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని కథ వినిపించగా, హనుమాన్ డైరెక్టర్ కాబట్టి వెంటనే ఒకే కూడా చెప్పినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి మరో సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Read More : Filmify Exclusive Prasanth Varma New Movie : బాబోయ్ ఏకంగా రణ్‌వీర్ సింగ్‌తో… జాక్ పాట్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ

- Advertisement -

రణవీర్ – ప్రశాంత్ మూవీ కి ప్రొడ్యూసర్ కూడా ఫిక్స్…?

ఇక జై హనుమాన్ మూవీ కి ముందే స్టార్ట్ చేయనున్న రణవీర్ మూవీ (Ranveer Singh Prashanth Varma Movie) కి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నారట. ఇక తాజాగా ఫిల్మీఫై నుండి అందిన సమాచారం ప్రకారం రణవీర్ ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి ప్రొడ్యూసర్ కూడా ఫిక్స్ అయ్యారట. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మించడానికి చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ హనుమాన్ సినిమా నైజాం రైట్స్ ని కొనుక్కోగా వారికి దాదాపు 25 కోట్ల లాభాన్ని అందించింది హనుమాన్ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమాని తామే నిర్మించాలని మైత్రి వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా 20 రోజుల కింద ఫిల్మీ ఫై కి వచ్చిన సమాచారం నిజం కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు