Sahithi dasari: చెర్రీ మామతో పోటీ కి సై అంటున్న పొలిమేర -2 నటి..నెగ్గేనా..?

Sahithi dasari.. రాజకీయాలకు సినిమాలకు ఎంతో విడదీయరాని అనుబంధం ఉన్నది.. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి.. మంచి సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు..అలాగే సీఎం హోదాలో కూడా రాష్ట్రాలను పాలించిన వారు ఉన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హవా జోరందుకుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు.. బాలయ్య తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.. అలాగే వైసిపి పార్టీ నుంచి నగరి ఎమ్మెల్యేగా రోజా పోటీ చేస్తున్నారు.

Sahithi dasari: Polimera-2 actress be ready to compate charan uncle.. is she won..?
Sahithi dasari: Polimera-2 actress be ready to compate charan uncle.. is she won..?

స్వతంత్ర అభ్యర్థిగా పొలిమేర -2..

ఇదిలా ఉండగా..తెలంగాణ లోకసభ ఎన్నికల బరిలో కూడా సినీ సెలెబ్రెటీలు దిగుతున్నారు కానీ ఆంధ్రాలో ఉన్నంత హడావిడి అయితే ఇక్కడ పెద్దగా కనిపించలేదు.. తాజాగా ఇప్పుడు ఒక నటి మాత్రం నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఎవరో కాదు మా ఊరి పొలిమేర, పొలిమేర-2 చిత్రాలలో నటించిన నటి సాహితీ దాసరి.. తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికలలో ఈమె పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. చేవెళ్లలోని లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతోందట. అయితే ఈమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ మామకు పోటీగా..

ఇటీవల అఫీడవిట్ లో తన ఆస్తులు సుమారుగా రూ .5 లక్షలు ఉన్నట్లు చూపించింది. ఆమె వయసు 29 ఏళ్ళు అని.. తనకి ఇంకా వివాహం కాలేదని తెలియజేస్తోంది. సాహితీ దాసరి ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. సర్కారు నౌకరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తదితర చిత్రాలలో నటించడమే కాకుండా ఈమె పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది. అంతేకాకుండా ప్రదీప్ చేసిన పెళ్లి చూపులు షోలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సాహితీ దాసరి పోటీ చేస్తున్న నియోజవర్గంలో.. గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ మామ కూడా ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారట.

- Advertisement -

ఆయన బిజెపి పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. వరుసకు రామ్ చరణ్ భార్య ఉపాసనకు ఈయన పెదనాన్న వరుస అవుతారట. దేశంలోనే అత్యధిక సంపన్నుల లిస్టులో కూడా విశ్వేశ్వర్ రెడ్డి పేరు సంపాదించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ జి.రంజిత్ రెడ్డి పోటీ చేయగా వీరితోపాటు టిఆర్ఎస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇప్పుడు సాహితీ దాసరి పోటీ పడబోతున్నారు. మరి వీరందరిలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

సాహితీ దాసరి విషయానికి వస్తే..

పొలిమేర -2 చిత్రంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సాహితీ దాసరి ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇన్ని రోజులు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను తన అందచందాలతో , నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఉన్నట్టుండి రాజకీయం వైపు మొగ్గు చూపడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఈమె నెగ్గుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు