HBD Boyapati Srinu: మాస్ కా బాప్.. సక్సెస్ అవ్వడానికి ఆ కమెడియనే నాంది..!

HBD Boyapati Srinu: Mas Ka Baap.. That comedian is the beginning of success..!
HBD Boyapati Srinu: Mas Ka Baap.. That comedian is the beginning of success..!

HBD Boyapati Srinu.. మాస్ కా బాప్ అనగానే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముందుగా గుర్తొచ్చేది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..పూరీ జగన్నాథ్ తర్వాత ఎంతోమంది క్లాస్ హీరోలను మాస్ హీరోలుగా చూపించిన ఘనత ఈయన సొంతం.. బాలకృష్ణ లాంటి లెజెండరీ నటులకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించారు బోయపాటి శ్రీను.. ఈయన నుంచీ సినిమా వస్తోందంటే సినీ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతారు.. ముఖ్యంగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో తెలిసిందే.. అలా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం

ఆ కమెడియన్ వల్లే కెరియర్ మొదలు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత 17 సంవత్సరాలుగా దర్శకుడిగా కొనసాగుతున్న బోయపాటి శ్రీను ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్ లో 9 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు.. రవితేజతో తీసిన భద్ర సినిమాతో మెగా ఫోన్ పట్టిన బోయపాటి.. మొదట కమెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్న పోసాని కృష్ణమురళి సహాయంతో ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.. అలా బోయపాటి శ్రీను కెరీయర్ కు పోసాని కృష్ణమురళి నాంది అయ్యారు..ఇక ముత్యాల సుబ్బయ్య దగ్గరగా అసిస్టెంట్ డైరెక్టర్ గా దర్శకత్వంలోని మెలకువలు నేర్చుకుని.. ఆయన దగ్గర పలు సినిమాలకు పని చేశారు.. తర్వాత రవితేజ భద్ర సినిమాతో మాస్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు.తెలుగులో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బోయపాటి.. ఈయన ఫైట్స్ తెరకెక్కించే విధానం మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది.

మస్ కా బాప్ బోయపాటి..

టాలీవుడ్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి తన 17 ఏళ్ల కెరియర్ లో ఒక్క బాలకృష్ణతోనే మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ కొట్టాడు.. ఇప్పుడు నాలుగో చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతున్నారు.. బోయపాటి తెరకెక్కించిన అన్ని చిత్రాలు మాస్ ఓరియెంటెడ్ గా ప్రత్యేక ఇమేజ్ దక్కించుకున్నాయి. ఇకపోతే అసలు సిసలైన మాస్ పల్స్ తెలిసిన సిసలైన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. దర్శకుడిగా బోయపాటి శ్రీను మొదటి చిత్రం భద్ర.. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.. రెండో చిత్రం వెంకటేష్ హీరోగా వచ్చిన తులసి.. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అలాగే చాలా కాలం పాటు విజయం కోసం ఎదురుచూసిన బాలయ్యతో కూడా సింహ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బోయపాటి.. ఇప్పుడు రామ్ పోతినేని తో ఒక సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాతో మరోసారి తన ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా బోయపాటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు