Vishal : ఆ భవనానికి కెప్టెన్ విజయకాంత్ పేరు.. అధ్యక్షుడి అనౌన్స్ మెంట్..

Vishal : కోలీవుడ్ లెజెండరీ స్టార్ ప్రముఖ నటులు రాజకీయ నాయకులు కెప్టెన్ విజయ్ కాంత్ ఇటీవలే మరణించారన్న సంగతి తెలిసిందే. ఆయన మరణం తో తమిళనాడు చిత్ర ప్రరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా కెప్టెన్ లేని లోటు ఇండస్ట్రీకి తీరనిది అని తెలిసిందే. ఇక రీసెంట్ గా తలపతి విజయ్ రానున్న “గోట్” సినిమాలో కెప్టెన్ విజయ్ కాంత్ ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో నటింపచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కెప్టెన్ విజయ్ కాంత్ కి ట్రిబ్యూట్ గా తమిళనాడు చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అసలు విషయానికీ వస్తే.. తమిళ నాడు మూవీ అసోసియేషన్ ‘న‌డిగ‌ర్ సంఘం’ కి సంబంధించి చెన్నై లో కొత్త భ‌వ‌నం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సంఘం అధ్య‌క్షుడిగా ప్రముఖ నటులు నాజ‌ర్, అలాగే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా హీరో విశాల్ కొన‌సాగుతున్నారు. గ‌తంలో విశాల్ కూడా అధ్య‌క్షుడిగా ప‌నిచేసారు. ఆ స‌మ‌యంలో సంఘానికి సొంతంగా తానే భ‌వ‌నం నిర్మిస్తానని మాటిచ్చారు. ప్ర‌స్తుతం ఆ మాట నిల‌బెట్టు కుంటున్నాడు విశాల్.

కెప్టెన్ కి ట్రిబ్యూట్.. భవనానికి ఆయన పేరు..

ఇక నడిగర్ సంఘం యొక్క భ‌వ‌న నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా గ్రాండ్ గా ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విశాల్ (Vishal) న‌డిఘ‌ర్ సంఘం భ‌వ‌నానికి ‘కెప్టెన్ విజ‌య్ కాంత్’ పేరు పెడతామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. విశాల్ కెప్టెన్ గురించి ప్రసవిస్తూ ఇలా అన్నారు. ‘కెప్టెన్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, అతను మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇక నడిగర్ సంఘం భవనానికి విజయకాంత్ పేరు పెడతాం. నడిగర్ సంఘం కోసం ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. విజయకాంత్ ఎంతో మందికి ఆదర్శం. నటులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకుల్లో విజయకాంత్ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. సాధారణంగా ఒక వ్యక్తిని భూలోకం నుంచి వెళ్లిన తర్వాతే దేవుడిగా కొలుస్తాము. కాని కానీ కెప్టెన్ బతికి ఉండగానే ప్రజల మనసుల్లో దేవుడిగా నిలిచాడు. ఎంత మంచి వారు కాకపోతే ప్రజలు కెప్టెన్ ను అలా కొలుస్తారు, ఆయన నడిగర్ సంఘం అధ్యక్షులుగా కూడా ఎంతో సేవ చేశారు. పేద కళాకారులను ఆదుకున్నారు అన్నాడు.

కెప్టెన్ పేరుకి అందరి మద్దతు..

ఇక గత కొన్ని రోజులుగా కూడా నడిఘర్ సంఘ భవనానికి విజయ్ కాంత్ పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా గ‌ట్టిగానే వినిపిస్తుంది. పలువురు స్టార్స్ కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే చెబుతున్నారు. కాబ‌ట్టి ఆయ‌న జ్ఞాప‌కార్దం ఒక ట్రిబ్యూట్ లా న‌డిగ‌ర్ సంఘ భవనానికి ఆయ‌న పేరు పెడ‌తామ‌న్నారు. ఇక విశాల్ కి మద్ద‌తుగా కోలీవుడ్ స్టార్స్ సూర్య‌, కార్తీ లాంటి హీరోలు నిలుస్తున్నారు. ఇక త్వరలోనే నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తవుతుందని, పలువురు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుల్ని ముఖ్య అతిథులుగా పిలిచి ఘనంగా ప్రారంభిస్తారని సమాచారం. ఇక ప్ర‌స్తుతం విశాల్’ ర‌త్నం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ కాగానే నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల్ని దగ్గరుండి చేసుకోనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు