Mahesh – Namrata: భార్య కోసం అలాంటి పని.. వార్షిక ఆదాయం తెలిస్తే షాక్..!

Mahesh – Namrata: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నమ్రత – మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వీరిద్దరూ సినిమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు పలు వ్యాపారాలు, చారిటీ కార్యక్రమాల ద్వారా కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబుకి తన భార్య నమ్రత అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా సరే.. కాస్త సమయం దొరికితే చాలు అటు భార్య, ఇటు పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటారు..

Mahesh - Namrata:Such a job for wife.. Shock if you know the annual income..!
Mahesh – Namrata:Such a job for wife.. Shock if you know the annual income..!

భార్య కోసం మహేష్ అలాంటి పని..

అంతేకాదు భార్య పేరిట కొన్ని ఆస్తులను కూడా రూపొందించారు మహేష్ బాబు.. ఒక రకంగా చెప్పాలి అంటే మహేష్ బాబు కెరియర్ లో ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఆయన సతీమణి నమ్రత అని చెప్పాలి ..మహేష్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ గా మారిందామే నమ్రత ఒకవైపు పిల్లలు, కుటుంబం అంటూ బాధ్యత తీసుకుంటూనే.. మరొకవైపు మహేష్ బాబుకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలను కూడా నడిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు హైదరాబాదులో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి సినిమాస్ అనే మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. మహేష్ పై జరుగుతున్న బిజినెస్ కావడంతో అది కేవలం సినిమా థియేటర్ లాగా కాకుండా పాపులర్ విసిటింగ్ ప్లేస్ గా కూడా మారిపోయింది.. ఇక ఇక్కడ వందల కోట్ల కాసులు కురుస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సక్సెస్ ఫార్ములాని మహేష్ బాబు మరో నగరంలో కూడా అప్లై చేయబోతున్నారు. ఏ ఎమ్ బి సినిమాస్ కొత్త బ్రాంచ్ ని బెంగళూరులో కూడా ప్రారంభించారు.. తాజాగా ఈ ఏఎంబి సినిమాస్ కి సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది.. ఇకపోతే ఏ ఎం బి సినిమాస్ కి మహేష్ బాబు పేరు ఉన్న అక్కడ నమ్రత పేరుపై బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.. మొత్తంగా బెంగళూరులో మరో కొత్త బిజినెస్ ని మహేష్ దంపతులు ప్రారంభించబోతున్నారు.. ఇకపోతే బంజారాహిల్స్ లో ఏఎన్ ప్యాలెస్ హైట్స్ అనే హోటల్ కూడా ఉంది ..ఈ హోటల్ కూడా నమ్రత పేరు పైనే ఉంది. భార్యకంటూ ఒక సంపాదన ఉండాలని మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

వార్షిక ఆదాయం ఎంతంటే..

అంతేకాదు వీరిద్దరికీ దుబాయ్ లో లగ్జరీ విల్లా కూడా ఉంది. అలాగే వాణిజ్య ప్రకటనల్లో కూడా మహేష్ బాబు టాప్ లో ఉన్నారు.. కార్పొరేట్ సంస్థలకు కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్ ..సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యారు.. ఇలా అన్ని రంగాలలో కూడా భారీ లాభాలను పొందుతున్న వీరిద్దరి వార్షికాదాయం రూ.400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.. ఒక ఏడాదికే ఇంత సంపాదిస్తున్నారంటే.. ఇక వీరి ఆస్తి వేల కోట్లు ఉంటుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు