Iswarya Menon : చీరలో ఐశు సొగసు చూడతరమా…

Iswarya Menon : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హీరోయిన్ గా పరిచయమైన కొత్త హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. తమిళ్ హీరోయిన్ అయిన ఈ భామ అక్కడ చాలా సినిమాలు చేసినా అంతగా సక్సెస్ కాలేదు. ఇక లాస్ట్ ఇయర్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “స్పై” సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. కానీ అనూహ్యంగా ఈ సినిమా ప్లాప్ కావడం జరిగింది. ఈ సినిమా పై ఐశ్వర్య మీనన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఐశ్వర్య మీనన్ కి నటిగా మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా తన గ్లామర్ కి ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ ఇప్పటివరకు మళ్ళీ తెలుగులో ఐశ్వర్య సినిమా చేయలేదు. అలాగని తమిళ్ లో కూడా చేయలేదు. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది.

ఏడాది తర్వాత తెలుగులో..

ఇక స్పై సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఐశ్వర్య మీనన్ ఆ సినిమాతో హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. కానీ తన గ్లామర్ తో టాలీవుడ్ మేకర్స్ ని అయితే అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా తాజాగా టాలీవుడ్ కార్తికేయ సినిమాలో నటిస్తుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “భజే వాయువేగం” పేరుతో తెరకెక్కుతుండగా, ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా స్పై రిలీజ్ కి ముందే ఫిక్స్ అయినా, షూటింగ్ మాత్రం ఈ మధ్యే మొదలు పెట్టారు. ఇక కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా, ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇతడు ఇంతకు ముందు సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడని సమాచారం. మరి స్పై సినిమాతో ప్లాప్ అందుకున్న ఐశ్వర్య రెండో సినిమాతోనైనా తెలుగులో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

స్కై బ్లూ లైట్ చీరలో ఐశ్వర్య అందాల ఆరబోత..

అయితే ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) సినిమాల పరంగా వరుస సినిమాలు చేయనప్పటికీ, సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లు చేస్తుంది. అందువల్ల సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా స్కై బ్లూ లైట్ కలర్ చీరల్లో ఐశ్వర్య అందాల ఆరబోత ఇంస్టాగ్రామ్ లో సూపర్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఐశ్వర్య ఎక్కువగా చీరలోనే ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి మత్తెక్కించే ఫోటోషూట్లతోనే ఇంస్టాగగ్రామ్ లో 3 మిల్లియన్లకి పైగా ఫాలోవర్లని సంపాదించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ్, మలయాళంలో చెరో సినిమా చేస్తుంది ఐశ్వర్య మీనన్. ఇక మలయాళంలో ఏకంగా మోహన్ లాల్ సినిమా బజుకా లో కీలక పాత్ర లో నటిస్తుంది. ఇక తెలుగులో చేస్తున్న భజేవాయువేగం హిట్ అయితే ఇక్కడ మంచి ఆఫర్లు అనుకునే ఛాన్స్ ఉంది .

- Advertisement -

Iswarya menon

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు