Iswarya menon : సైలెంట్ గా రెండో సినిమా పూర్తి చేసేస్తోంది!

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హీరోయిన్ గా పరిచయమైన కొత్త హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. తమిళ్ లో చాలా సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “స్పై” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అనూహ్యంగా ప్లాప్ కావడం జరిగింది. ఈ సినిమా పై ఐశ్వర్య మీనన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఐశ్వర్య మీనన్ కి నటిగా మంచి పేరు తెచ్చింది. పైగా తన గ్లామర్ కి ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చిన్న సమంత ల ఉందే అని కితాబిచ్చారు. కానీ తెలుగులో సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రావడం లేదు. ఇక ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా నటిస్తున్న సినిమా “బజూకా” లో ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. అయితే ఆ సినిమాలో ఐశ్వర్య హీరోయినా? లేక కీలక పాత్రలో నటిస్తుందా అనే విషయం తెలియదు. అయితే ఐశ్వర్య మీనన్ ఆ సినిమా మాత్రమే చేస్తుందని, తెలుగులో ఆఫర్లు అయితే లేవని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామ తన ప్లానింగ్ లో తాను ఉందని తెలిసింది. ఐశ్వర్య మీనన్ తాజాగా ఓ సినిమాలో నటిస్తుందని క్లారిటీ ఇచ్చేసింది.

కార్తికేయతో కలిసి..

స్పై సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఐశ్వర్య మీనన్ ఆ సినిమాతో హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. కానీ తన గ్లామర్ తో టాలీవుడ్ మేకర్స్ ని అయితే అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా తాజాగా కార్తికేయ సినిమాలో నటిస్తున్నట్టు తన ఇంస్టాగ్రామ్ నుండి రివీల్ అయింది. కార్తికేయ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ సెట్స్ లో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి బర్త్ డే కి స్పెషల్ గా విష్ చేస్తూ కేక్ కట్ చేసి, ఆ ఫోటోలని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది ఐశ్వర్య. ఆ స్టిల్స్ లో హీరో కార్తికేయతో పాటు మేకర్స్ ఉన్నారు. నిజానికి ఈ సినిమా స్పై రిలీజ్ కి ముందే ఫిక్స్ అయినా, షూటింగ్ మాత్రం ఈ మధ్యే మొదలు పెట్టారు. ఇక తెలుగులో ఏ సినిమా చెయ్యట్లేదు అని అనుకున్న నెటిజన్లకు ఐశ్వర్య షాకిచ్చిందనే చెప్పాలి.

- Advertisement -

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో..

ఇక కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా, ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇతడు ఇంతకు ముందు సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడని సమాచారం. మరి స్పై సినిమాతో ప్లాప్ అందుకున్న ఐశ్వర్య రెండో సినిమాతోనైనా తెలుగులో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. ఇక ఐశ్వర్య రీసెంట్ గా మరో రెండు కథలకు ఓకే చెప్పిందని సమాచారం. అయితే సినిమాల పరంగా వరుస సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లు చేస్తుంది. అందువల్ల సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అదే ఈరోజూ ప్లాప్ లు ఉన్నా అవకాశాలు రావడానికి సహాయపడుతుందని చెప్పొచ్చు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు