Iswarya Menon : వాలెంటైన్స్ డే రోజు మత్తెకించే ఫోజులిచ్చిన ఐశ్వర్య..

 

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హీరోయిన్ గా పరిచయమైన కొత్త భామల్లో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. తమిళ్ లో చాలా సినిమాలు చేసిన ఈ భామ నిఖిల్ నటించిన “స్పై” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. కానీ ఐశ్వర్య మీనన్ కి నటిగా మంచి పేరు తెచ్చింది. తన గ్లామర్ కి ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ తెలుగులో సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా నటిస్తున్న సినిమా “బజూకా” లో ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. అయితే ఆ సినిమాలో ఐశ్వర్య హీరోయినా? లేక కీలక పాత్రలో నటిస్తుందా అనేది తెలియదు.

ఇదిలా ఉండగా ఐశ్వర్య తాజాగా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఎర్రటి చీరలో ఐశ్వర్య మీనన్ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. మామూలుగానే సోషల్ మీడియాలో ఐశ్వర్య పెట్టే పిక్స్ కి వేలల్లో లైకులు వస్తుంటాయి. ఇక తాజాగా షేర్ చేసిన ఈ హాట్ స్టిల్స్ కి లక్షల లైకులు వచ్చిపడుతున్నాయి. ఇక వాలెంటైన్స్ డే కాబట్టి ప్రేమకు చిహ్నమైన రోజా కలర్ చీరలో గ్లామర్ ఒలకబోసింది. సినిమాల్లో ప్లాపులు వస్తున్నా సోషల్ మీడియా లో మాత్రం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించింది ఈ అమ్మడు.

- Advertisement -

ఇక తెలుగు లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న ఈ భామ, రీసెంట్ గా రెండు కథలకు ఓకే చెప్పిందని టాక్. అయితే ఇటు గ్లామర్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా మంచి టాలెంట్ ఉన్న ఐశ్వర్యా మీనన్ కి ఫ్యూచర్ లో టాలీవుడ్ లో మంచి అవకాశాలొస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు