Bazooka: మలయాళ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకున్న “స్పై” హీరోయిన్!

Iswarya Menon with Mammootty!

టాలీవుడ్ లో ఈ ఏడాది హీరోయిన్ గా పరిచయమైన కొత్త భామల్లో ఒకటి ఐశ్వర్య మీనన్. తమిళ్ లో చాలా సినిమాలు చేసిన ఈ భామ ఈ ఏడాది “స్పై” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఎన్నో ఆశలు పెట్టుకుంది ఐశ్వర్య మీనన్. ఎందుకంటే తమిళ్ లో చాలా సినిమాలు చేసినా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. తెలుగులో స్పై సినిమాతో మంచి హిట్ కొట్టి ఇక్కడ ఆఫర్లు అందుకుందామనుకుంది.

కానీ ఇటీవల రిలీజ్ అయిన “స్పై” బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. కానీ ఐశ్వర్య మీనన్ కి మంచి పేరు తెచ్చింది ఈ సినిమా. తన గ్లామర్ కి కూడా ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ తెలుగులో సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రాలేదని తెలుస్తుంది. కానీ తాజాగా మలయాళం లో ఒక లెజెండరీ స్టార్ సినిమాలో మాత్రం ఆఫర్ కొట్టేసింది ఐశ్వర్య.

ఆ స్టార్ ఎవరో కాదు, మలయాళ స్టార్ మమ్ముట్టి. రీసెంట్ గా మలయాళం లో “క్రిస్టోఫర్” సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఆయన, తెలుగులోనూ ఏజెంట్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. ఇకపోతే మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “బజూకా” లో ఐశ్వర్య మీనన్ నటిస్తున్నట్టు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ సినిమాలో ఐశ్వర్య హీరోయినా? లేక కీలక పాత్రలో నటిస్తుందా అనేది తెలియదు. ఏది ఏమైనా తెలుగులో దున్నేస్తుందనుకుంటే మాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ భామ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు