Matka: వరుస ఆఫర్లతో జోరు మీదున్న మీనాక్షి!

Meenakshi Chaudhary new movie

టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ సినిమాతో హీటెక్కించిన బ్యూటీ మీనాక్షి చౌదరి. రీసెంట్ గా విజయ్ ఆంటోని నటించిన హత్య సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఈ భామ అందులో ఒక మోడల్ గా నటించి మెప్పించింది. గత ఏడాది పెద్దగా సినిమాలు చేయని మీనాక్షి ఈ సంవత్సరం మాత్రం వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉంది.

ఇక ఈ సంవత్సరం కొన్ని రోజుల కిందటే హత్య సినిమాతో రాగా, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరుసగా రెండు తెలుగు సినిమా షూటింగ్ లోను బిజీగా ఉన్న మీనాక్షికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “మట్కా” లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం.

తాజాగా ఓపెనింగ్ జరుపుకున్న మట్కా ఓపెనింగ్ కి మీనాక్షి చౌదరి కూడా వచ్చింది. ఇక తమిళ్ లో కూడా కార్తీ తో ఒక సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకే ఏడాది మూడుకి పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా కాలం గడిపేస్తుంది మీనాక్షి. మరి ఈ సినిమాల్లో ఎదో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మీనాక్షి చౌదరికి స్టార్ స్టేటస్ అందిస్తుందేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు