Matka: వరుణ్ తేజ్ పాన్ ఇండియా చిత్రానికి క్రేజీ టైటిల్

Varun tej new movie title matka:

టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. మెగా కాంపౌండ్ లో విభిన్న చిత్రాలు చేస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఆ సినిమాని కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా పూజ కార్యక్రమాలతో ఓపెనింగ్ జరుపుకోగా, ఆ ఓపెనింగ్ కి చిత్ర యూనిట్ మొత్తం రావడం జరిగింది.

వరుణ్ తేజ్ 14వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ క్యాచీ టైటిల్ ని నిర్ణయించారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి “మట్కా” అనే టైటిల్ ని నిర్ణయించారు. మట్కా అంటే ముంబై వంటి నగరాల్లో బెట్టింగ్ లు వేసే ఒక అక్రమవ్యాపారం. ఈ సినిమా టైటిల్ ని బట్టి సినిమాలో హీరో అదే బిజినెస్ చేసేవాడిగా నటించే అవకాశం ఉంది. లేకపోతే ఆ అక్రమ వ్యాపారాన్ని అరికట్టే ఆఫీసర్ గా కూడా యాక్ట్ చేయవచ్చు.

తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో అన్ని పాత నోట్లు చూపించడం జరిగింది. దీన్ని బట్టి సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటిస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక “మట్కా” సినిమా రెగ్యులర్ షూటింగ్ వరుణ్ తేజ్ నటించిన “గాండీవధారి అర్జున” సినిమా రిలీజ్ తరువాతే మొదలవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు