Jailer: సీనియర్స్ తో నటించడానికి కారణం ఇదే- తమన్నా

Tamannaah said the reason

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన భామ తమన్నా. ఇప్ప్పుడు టాప్ హీరోలతో యంగ్ హీరోలతో ఆఫర్స్ రాక సీనియర్ హీరోలతో, లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఇంకా ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ అవుతుంది. ఇక తాజాగా నటించిన రెండు భారీ చిత్రాలు ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “జైలర్” మూవీ కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో అనగా ఆగష్టు10న జైలర్, 11న భోళా శంకర్ రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఈ రెండు సినిమాలు సీనియర్ స్టార్స్ నటించిన సినిమాలు కావడం విశేషం. ఇక తాజాగా తమన్నా జైలర్ యొక్క హిందీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనింది. అయితే అక్కడ తమన్నా కు మీడియా ద్వారా పలు ప్రశ్నల సవాళ్లు ఎదురయ్యాయి. కానీ వాటిని స్మూత్ గా తిప్పికోట్టింది తమన్నా. అందులో ముఖ్యంగా ఏంటంటే, తమన్నా ఎందుకు ఇప్పుడు సీనియర్ యాక్టర్లతో నటిస్తుంది. ఆఫర్లు లేకనా, లేక మరేదైనా కారణమా? వారికి మీకు మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. మరి మీకు వాళ్ళతో నటించాలని ఎలా అనిపించింది అని మీడియా ప్రతినిధి అన్నాడు.

దానికి తమన్నా బదులిస్తూ, తనకి ఆఫర్లు లేక కాదు, డబ్బులు ఆశించి కాదు, తనకి తెలిసినంతవరకు వాళ్లొక నటులు, నేనొక నటిని, నటీనటులకు ఏజ్ గ్యాప్ తో సంబంధం ఉండదు. ఇదే హాలీవుడ్ సినిమాల్లో చేస్తే అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. సినిమా కంటెంట్ ని ఆ క్యారెక్టర్ ని మాత్రమే చూస్తారు. ఆ మార్పు ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు