RaviTeja: టైగర్ టీజర్ ఎప్పుడంటే..?

మాస్ మహారాజ రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తి పెంచిన నేపథ్యంలో టీజర్, ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 20న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా టీజర్ ఆగస్టు 6న రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న రవితేజ స్పీడ్ కి రావణాసుర సినిమా బ్రేక్ వేసింది.

డిజాస్టర్ వచ్చినప్పటికీ రవితేజ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలను లైన్లో పెట్టాడు. గ్లిమ్ప్స్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని సమాచారం. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత సందిగ్దత ఏర్పడింది. అక్టోబర్ 19న బాలయ్య అనీల్ రావిపూడి ల భగవంత్ కేసరి సినిమా, విజయ్, లోకేష్ కనగరాజ్ ల లియో సినిమా ఉండటంతో టైగర్ అక్టోబర్ 20న రిలీజ్ అవ్వటంపై డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

రావణాసుర లాంటి డిజాస్టర్ తర్వాత వస్తన్న ఈ సినిమా హిట్ అవ్వటం రవితేజకి కీలకంగా మారింది కాబట్టి రిలీజ్ సమయంలో పెద్దగా పోటీ ఉండకుండా చూసి రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి, రవితేజకి హిట్ కంపల్సరీ అయిన పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు