Tamannah’s Breakup: అంత హడావిడి చేసి అప్పుడే బ్రేకప్ ఎలా తమన్నా..?

Tamannah’s Breakup

మిల్కీ బ్యూటీ తమన్నా యాక్టర్ విజయ్ వర్మ ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి ఎప్పటినుండో గాసిప్స్ వస్తున్నప్పటికీ స్పందించని జంట, ఇటీవల ఇద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్2 సినిమా ప్రమోషన్స్ లో తమ లవ్ స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చారు.

అప్పటిదాకా బోల్డ్ సీన్స్ కి దూరంగా ఉన్న సమంత లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి హీట్ పెంచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూస్ లో త్వరలోనే తాము పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా హింట్స్ ఇచ్చింది ఈ జంట.

అయితే, విజయ్ వర్మతో రిలేషన్ కి తమన్నా బ్రేకప్ చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లస్ట్ స్టోరీస్ ద్వారా అంతటి హంగామా చేసిన తమన్నా ఇంతలోనే బ్రేకప్ చెప్పటం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ, సోషల్ మీడియాలో తమన్నా బ్రేకప్ విషయం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వచ్చిన రూమర్స్ కి స్పందించని ఈ జంట ఇప్పుడు బ్రేకప్ విషయంలో వస్తున్న రూమర్స్ కి ఏపండిస్తారో లేదో చూడాలి.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఆఫర్లు సన్నగిల్లిన తమన్నాకు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ క్లిక్ అవ్వటంతో వరుసగా ఆఫర్లు రావటం మొదలయ్యాయి. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, రజినీకాంత్ జైలర్ సినిమా కూడా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇవే కాకుండా తమిళ్ లో పలు ఆఫర్లు కూడా ఉన్నాయని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు