Andhrawala : మూవీ ప్లాప్ కావడానికి ఇదే కారణం.. ఎవ్వరికి తెలీని నిజాలు..

Andhrawala : సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాల కథలు బాగున్నా, అది తీసే విధానంలో విఫలమై ప్లాప్ అవుతుంటాయి. ఆ క్రమంలో దర్శక నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఆ చిత్ర నటీనటులకు కూడా వాళ్ళ తర్వాతి సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసి ఆ తర్వాత ప్రేక్షకులని పూర్తిగా నిరాశ పరిచి అంచనాలను అందుకోక బొక్క బోర్లా పడతాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా చిత్రం అలాంటి ఫలితాన్నే అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు. ఎన్టీఆర్ తో పాటు అభిమానులకు చేదు జ్ఞాపకంలా ఇది మిగిలిపోయింది ఈ సినిమా. టాలీవుడ్ లో సింహాద్రి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన ఆంధ్రావాలా (Andhrawala) సినిమా థియేటర్ల వద్ద ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు. పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద హైప్ మరో లెవల్ కి వెళ్ళగా సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

కన్నడలో సూపర్ హిట్..

అయితే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటైన ఈ సినిమాను కన్నడలో స్వర్గీయ నటుడు అయిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా “వీర కన్నడిగ” పేరుతో ఏకకాలంలో తెరకెక్కించారు. పూరీజగన్నాథ్ రెండింటికి కథ రాయగా, తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తే.. కన్నడ వెర్షన్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. మెయిన్ స్టోరీ పాయింట్ అదే అయినా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ సింహాద్రి తర్వాత సినిమా కావడం వల్ల మరీ అంచనాలు ఎక్కువ అవ్వడం, సెకెండ్ ఆఫ్ స్టోరీ అంచనాలను అందుకోక పోవడం ఆ టైంలో భారీగా ఎదురుదెబ్బ కొట్టాయి. కానీ కన్నడ ఆడియన్స్ కి వీర కన్నడిగ బాగానే నచ్చడంతో అక్కడ భారీ విజయాన్ని ఆ సినిమా సొంతం అయ్యింది. ఒక భాషలో ఫ్లాఫ్ అయిన సినిమా మరో భాషలో హిట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం పట్ల పెద్ద కారణాలే ఉన్నాయి.

నందమూరి అభిమానుల్లో గొడవలు..

ఎన్టీఆర్ ఆంధ్రావాలా (Andhrawala) ప్లాప్ కావడానికి ఒక రకంగా ఓవర్ గా అంచనాలను పెట్టుకోవడమే కారణం అని చెప్పొచ్చు. ఈ సినిమాపై ఆ స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణం ఆడియో ఫంక్షన్. అలాగే డిజాస్టర్ కావడానికి కారణం కూడా నుంచే మొదలయింది. అప్పట్లో నందమూరి తారక రామారావు సొంతవూరు నిమ్మకూరులో ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం జరగగా, ఈ కార్యక్రమంకోసం పలు ప్రాంతాలనుండి నిమ్మకూరుకు ప్రత్యేక రైళ్ళు నడిపారు. ఈ వేడుకకు దాదాపుగా 5 నుండి 10 లక్షలమంది వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు 10 కి.మీ. ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఎన్టీఆర్ హెలికాప్టర్ లో కార్యక్రమానికి వచ్చాడు. ఇంత భారీ సందడి జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకోగా, రిలీజ్ తర్వాత అంచనాలను అందుకోలేక ప్లాప్ అయింది. అయితే అప్పట్లో ఈ ఆడియో కార్యక్రమం నందమూరి అభిమానులు బాలకృష్ణ కి వ్యతిరేకంగా హరికృష్ణ వర్గం ఏర్పాటు చేసారని వార్తలు వచ్చాయి. దీని వల్ల రిలీజ్ తర్వాత చాలా మంది బాలయ్య అభిమానులు ఈ సినిమా ఓపెనింగ్స్ కి కూడా సహకరించలేదు. ఇక ఈ సినిమా కన్నడ లో హిట్ అవడానికి కారణం న్యాచురాలిటి. తెలుగులో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కావడంతో మరింత హై ఇచ్చేలా సీన్లు రాసుకున్నారు. దాంతో మురికివాడల్లో పెరిగిన కుర్రాడు ఒక్కసారిగా డాన్ రేంజ్ కి రావడం లో కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాయి. అన్ని కన్నడ లో సందర్భాన్ని బట్టి మాత్రమే హీరో హై అయ్యాడు. సినిమా చూసిన వారికి అది అర్ధమైపోతుంది. వీటన్నిటికీ మించి ఎన్టీఆర్ సెకండాఫ్ లో కనిపించే తండ్రి పాత్రలో కాస్త పసిఛాయలు కనిపంచేసరికి, ఆ పెద్ద మీసాలతో లుక్ పరంగా అంతగా ఇంప్రెస్ చేయలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు