HBD Anushka Sharma: ఆర్మీ కుటుంబం నుండి సినీ నటిగా..!

HBD Anushka Sharma.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శర్మ కూడా ఒకరు.. ఈ రోజున అనుష్క శర్మ 35వ పుట్టినరోజు.. ఆమె అభిమానులు ఈ వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ భార్య కావడంతో అటు ఇరువురు అభిమానులు కూడా ఈమె పుట్టినరోజున చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అనుష్క విషయానికి వస్తే ..అయోధ్యలో జన్మించింది. ఈమె కుటుంబం ఆర్మీ నేపథ్యం కుటుంబం. ఆర్మీ కుటుంబం నుంచి సినీ నటిగా అనుష్కశర్మ ఎలా ఎదిగిందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

HBD Anushka Sharma.. From an army family to a film actress..!
HBD Anushka Sharma.. From an army family to a film actress..!

మొదట జర్నలిజం వైపు అడుగులు..

అనుష్క శర్మ తండ్రి అజయ్ కుమార్ శర్మ ఆర్మీలో సైనిక అధికారిగా పని చేశారు..ఈమె తల్లి ఆషియా శర్మ.. పిల్లలను ఇంటి పనులు మాత్రమే చూసుకుంటూ ఉండేదట.. అనుష్క పుట్టినప్పటి నుంచి ఎక్కువగా బెంగళూరు , అస్సాం వంటి ప్రాంతాలలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. మొదట అనుష్క శర్మ ఇండస్ట్రీలోకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. తను ఒక జర్నలిజంలో చేరి జర్నలిస్టుగా పేరు సంపాదించాలనుకుందట. దీంతో తన కోరిక మేరకే ఒక ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా కూడా పనిచేసింది. ఆ తరువాతే మోడలింగ్ వైపుగా అడుగులు వేస్తూ తన కెరీర్ ని మొదలుపెట్టింది.

మోడలింగ్ లో ప్రవేశం..

ముంబై కి వెళ్లిన అనుష్క అక్కడ మోడలింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2007లో మొదటిసారి ఒక ఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. అలా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పలు రకాల జువెలరీ, స్కిల్ అండ్ సైన్స్, ఇతరత్రా బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది అనుష్క శర్మ. ఇక నటన పైన కాస్త ఇంట్రెస్ట్ పుట్టడంతో ఒక ఫిలిం యాక్టింగ్ స్కూల్లో చేరి ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న అనుష్క శర్మ లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించింది.

- Advertisement -

విరాట్ కోహ్లీతో ప్రేమాయణం..

అనుష్క కెరీర్ ని రబ్ నే బనాదీ జోడీ సినిమా ఒక్కసారిగా మార్చేసింది.సినిమాలు ఎలా ఉన్నప్పటికీ అనుష్క శర్మకు మాత్రం వరుసగా ఆఫర్లు వస్తూ ఉండేది… ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. అలాంటి సమయంలో ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరు 2017లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నది అనుష్క శర్మ.

కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యత..

కోహ్లీ – అనుష్క శర్మ జంట 2021న కూతురు వామికాకు జన్మనిచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇటీవలే ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువగా అనుష్క శర్మ ఫ్యామిలీ తోనే తన సమయాన్ని ఎక్కువగా గడపాలని చూస్తోంది. అలాగే తన భర్తకు కూడా ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనుష్క శర్మ. అలా ఆర్మీ కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు