HBD Thala Ajith: అజిత్ హీరోగా పరిచయమైంది తెలుగులోనే! చిరంజీవి చేతులమీదుగా!

HBD Thala Ajith : కోలీవుడ్ సూపర్ స్టార్ గా సౌత్ ఇండియాలో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్న అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థలా అజిత్ గా అభిమానుల చేత పిలిపించుకునే ఈ హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలలో ఎంతో నిరాడంబరంగా ఉండే హీరోల్లో అజిత్ ఒకరు. నిజానికి అజిత్ తెలంగాణ వాడని తెలుసా? అవును.. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అజిత్ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే అజిత్ కుమార్ తండ్రి సుబ్రహ్మణ్యం ఒక కేరళ వ్యక్తి కాగా, తల్లి కోల్ కతా కి చెందిన వారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇక సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ చిన్న తనంలోనే చదువుఆపేసి బైక్ రేసింగ్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. అలా రాయల్ ఎంఫిల్డ్ మెకానిక్ గా పనిచేస్తూనే మోడలింగ్ చేసేవాడు. అక్కడి నుండి సినిమాలపై ద్రుష్టి మళ్లింది. ఆ సమయంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే తమిళ్ లోనే బ్రేక్ రావడంతో అక్కడే స్టార్ హీరోగా ఎదిగి స్థిర పడ్డాడు. ఇప్పుడు వరుస సినిమాలతో సౌత్ లో బిజీ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. అయితే అజిత్ కుమార్ ఇంత స్టార్ డమ్ అనుభవిస్తున్నా ఏనాడూ బయట సోషల్ మీడియా లో కనిపించలేదు. పెద్దగా సినిమా ఫంక్షన్ లకు గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కుడా ఆయన హాజరవ్వరు. అయితే నిజానికి అజిత్ నటుడుగా, ఒక హీరోగా పరిచయమైంది ఒక తెలుగు సినిమా తోనే అని ఎంతమందికి తెలుసు? అవును అజిత్ కుమార్ హీరోగా మొదటగా నటించింది తెలుగు చిత్రంలోనే.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా.. హీరోగా..

ఇక తమిళ్ లో సూపర్ స్టార్ గా అభిమానుల చేత కీర్తించబడుతున్న అజిత్ (HBD Thala Ajith) ముందుగా హీరోగా తెలుగులోనే పరిచయమయ్యాడని చాలా మందికి తెలీదు. అది కూడా ఆ రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి చేత క్లాప్ కొట్టించుకున్నాడు. అజిత్ హీరోగా మారడానికి ముందు 1992 లో ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీ రావు తనయుడు శ్రీనివాస్ దర్శకుడుగా “ప్రేమ పుస్తకం” అనే సినిమాను అజిత్ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా అజిత్ కుమార్ నటించగా హీరోయిన్ గా కాంచన్ నటించింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా దర్శకుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా కనుమూశాడు. కాబట్టి ఈ సినిమాకు కొంత కలం గ్యాప్ వచ్చింది. ఇక కొన్ని నెలల తర్వాత గొల్లపూడి మారుతీరావు ప్రేమ పుస్తకం మిగిలిన భాగానికి దర్శకత్వం వహించారు. ఈ లోపు అజిత్ తమిళ్ లో అమరావతి అనే సినిమాలో హీరోగా నటించాడు.

తెలుగులోనూ హిట్..

ఇక అజిత్ కుమార్ హీరోగా నటించిన “ప్రేమ పుస్తకం” జులై 16 1993 లో విడుదలై విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో గొల్లపూడి మారుతీ రావు నంది అవార్డుని గెలుచుకున్నారు. ఈ విధంగా అజిత్ తెలుగులో పరిచయమయ్యాడు. అయితే ఈ షూటింగ్ జరుగుతుండగా దర్శకుడి మృతి వల్ల షూటింగ్ గ్యాప్ రాగా, ఆ గ్యాప్ లో అమరావతి అనే తమిళ సినిమా చేయగా అజిత్, తెలుగులో కంటే కేవలం నెల రోజుల ముందు ఆఫీషియల్ గా తమిళ ప్రేక్షకులకు ముందు పలకరించాడు. ఆ సినిమా 1993 జూన్ 4 న విడుదలయింది. అఫిషియల్ గా ఆ సినిమాయే ముందొచ్చినా నెల రోజుల గ్యాప్ తో వచ్చిన “ప్రేమ పుస్తకం” సినిమాయే లెక్కలోకి వస్తుంది. అయితే అప్పటికే తమిళ్ లో ఎక్కువ బ్రేక్ రావడంతో అక్కడే సినిమాలు చేశారు. ఇక నేడు తమిళనాట అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు. ఇక అజిత్ ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకున్నాడు. ఇక నేడు (మే1) అజిత్ (HBD Thala Ajith) పుట్టినరోజు సందర్బంగా తనకి filmify తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు