HBD Thala Ajith : మెకానిక్ నుండి థలా అజిత్ గా ఇన్స్పైరింగ్ జర్నీ…

HBD Thala Ajith : థలా అజిత్.. ఈ పేరే ఒక క్రేజ్.. ఒకప్పుడు బైక్ మెకానిక్.. ఇప్పుడు సౌతిండియా సూపర్ స్టార్ లలో ఒకరు. ఇతని సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులు నెల ముందు నుండి థియేటర్ల దగ్గర బ్యానర్లు పెడతారు. సోషల్ మీడియాలో సినిమా రికార్డుల లెక్కలు మొదలెడతారు. కానీ ఆ హీరో మాత్రం తాను ఒక స్టార్ హీరో అని ఏమాత్రం గర్వం లేకుండా.. ఒక నటుడ్ని అనేలా మాత్రమే ఉంటారు. అసలు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అంటే ఇలాగే ఉండాలనే కొలమానాలు కొన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి. స్మార్ట్ లుక్స్, స్టైలిష్ డ్రెస్సింగ్ ఇలా చెప్పుకుంటూపోతే బొలెడన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని ఈ రోజుల్లో హీరోగా గుర్తిస్తారు. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా ఉంటారు అజిత్. తల, గడ్డం నెరిసినా, కనీసం రంగు కూడా వేసుకోకుండా అదే న్యాచురల్ ఫేస్ తో నటనని కొనసాగిస్తూ ట్రెండ్ సెట్ చేసారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు, వరల్డ్ ఫేమస్ అయిన బైక్ రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అజిత్ (HBD Thala Ajith) బర్త్ డే (మే 1) ఈరోజు. ఈ సందర్బంగా మెకానిక్ నుండి థలా అజిత్ గా మారిన తన ఇన్స్పైరింగ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

బైక్ మెకానిక్ నుండి హీరోగా…

కోలీవుడ్ స్టార్ అయిన అజిత్ హైదరాబాద్ కి చెందివాడే కావడం విశేషం. 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. అయితే అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి కాగా, తల్లి సింధిది కోల్‌కతా, ఇక పదో తరగతికే చదువాపేసిన అజిత్ తన ఫ్రెండ్ ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేసాడు. ఆ తర్వాత తండ్రి కోసం మరో జాబ్ కూడా చేసాడు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే అజిత్ మోడలింగ్ చేసాడు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ ఆయనను గుర్తించి, సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్‌తో ఆయన ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులోనే ‘ప్రేమ పుసక్తం’ అనే సినిమా ద్వారా ఆయన హీరోగా మారారు. కానీ, కానీ ఆ సినిమా కొన్నాళ్ళు ఆగిపోగా, దానికంటే ముందే తమిళ్ లో 1993లో ‘అమరావతి’ అనే సినిమా ద్వారా అజిత్ తొలిసారిగా వెండితెరపై కనిపించాడు. కానీ అప్పటికి అంతగా గుర్తింపు రాణి అజిత్ మొదట సైడ్ క్యారెక్టర్లు కూడా వేశారు. ఇక 1995లో విడుదలైన ‘ఆసై’ సినిమా ద్వారా తొలి సక్సెస్‌ని అందుకున్నారు అజిత్. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆ తర్వాత ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ మరో బ్లాక్ బస్టర్ కొట్టగా, 1999లో SJ. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలీ’ సినిమాతో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకోగా, తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ ఏడాది అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా, అన్ని సూపర్ హిట్స్ అయ్యాయి.

ఫార్ములా 2 కార్ రేసింగ్‌లో అజిత్..

విలన్, తిరుపచి లాంటి సూపర్ సక్సెస్ లు సాధించిన అజిత్ ‘బిల్లా’ సినిమా ద్వారా సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అజిత్. ఆ తర్వాత గ్యాంబ్లర్, ఆరంభం, వీరమ్, ఎన్నాయ్ అరిందాల్, వేదాలం, తునీవు తదితర చిత్రాలతో అభిమానులను అలరించాడు అజిత్. ఇప్పటివరకు దాదాపు 60 కి పైగా చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్‌లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు. ఇక యాక్టింగ్‌తో పాటు రేసింగ్‌లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న అజిత్ అందులోనూ తన సత్తా చాటాడు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో అజిత్ ఒకరు. ఇక నటి షాలిని ని పెళ్లి చేసుకున్న అజిత్ ఫ్యామిలీ పరంగా ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. కనీసం సినిమా ఆడియో ఫంక్షన్ లకు కూడా అజిత్ రాడని చాలా మందికి తెలియదు. ఇక ప్రస్తుతం విదా మయుర్చి లో నటిస్తున్న అజిత్ జులై లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు