Hero Jai: రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో జై.. ఫోటో వైరల్..!

Hero Jai.. ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాచిలర్ లైఫ్ వీడి ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే మరి కొంతమంది 60 సంవత్సరాలకు చేరువలో ఉన్నా ఇంకా పెళ్లి మాట ఎత్తలేదు.. కానీ ఈ మధ్యకాలంలో వరుస అవకాశాలు అందుకుంటూ ఒక వైపు కెరియర్ లో బిజీగా ఉంటూనే మరొకవైపు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరో జై కూడా ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు హీరో జై గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. జర్నీ సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ని మార్చేసుకున్నారు ఈ హీరో.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. గతంలో జర్నీ సినిమాలో నటించిన హీరోయిన్ అంజలితో గత కొన్నేళ్లుగా ప్రేమయాణం సాగించారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి అయితే అనుకోకుండా వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ కావడంతో ఎవరి దారు వారు చూసుకున్నారు అని వార్తలు వినిపించాయి.

Hero Jai: Hero Jai got married secretly.. photo viral..!
Hero Jai: Hero Jai got married secretly.. photo viral..!

పెళ్లి చేసుకున్న హీరో జై..

ఆ తర్వాత అటు అంజలి ఇటు జై ఇద్దరు కూడా సినిమాల పై ఎక్కువగా దృష్టి పెట్టారు. తాజాగా హీరో జై ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా నగారా తో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేయడంతో ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. జై, ప్రగ్యా ఇద్దరు కలిసి తమిళంలో ఎన్నో చిత్రాలలో కూడా నటించారు. దీంతో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇలాంటి తరుణంలో ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉండగా ఆమె పక్కన జై కూర్చొని ఉండడంతో పాటు తన చేతిలో రెండు పాస్పోర్ట్లు , ఫ్లైట్ టికెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇద్దరూ ఒకే పోస్టుతో క్లారిటీ..

ఈ ఫోటోలకు కిందన రాసుకొస్తూ.. దేవుడు దయతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టానంటూ.. ఇద్దరు ఒకే ఫోటోను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకొని హనీమూన్ కి వెళుతున్నారేమో అంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులైతే ఈ విషయం తెలియగానే కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేస్తున్నారు.

- Advertisement -

అయితే తమిళ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇదంతా కేవలం సినిమా మూవీ ప్రమోషన్ ఏమో అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బేబీ అండ్ బేబీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోందని అందుకే హీరో జై ,ప్రగ్యా ఇద్దరు కూడా ఇందులో నటిస్తున్నారు. అలాగే యోగిబాబు, సత్యరాజ్ వంటి వారు కూడా ఇందులో కీలకమైన పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం. సినిమా ప్రమోషన్స్ ని ఇలా ఒక్కసారిగా డిఫరెంట్ గా మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటిదే ఈ ఫోటో అన్నట్లుగా కూడా తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం పైన వీరిద్దరూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఇది సినిమా ప్రమోషనా లేకపోతే నిజజీవితంలో ఈ సంఘటన చోటు చేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు