SriSri Birth Anniversary : సినీ ప్రస్థానంలో.. శ్రీశ్రీ మరో ప్రస్థానం..

SriSri Birth Anniversary : తెలుగు ప్రజల్లో ప్రజా రచయితల్లో ఒకరైన శ్రీ శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ తరం ప్రజానీకానికి కూడా ఆయన ఎంతో ఆదర్శం. ఆయన కవితల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. పాటల్లో వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. సూక్తుల్లో యువతను ఆలోచింపచేసే తత్వం ఉంటుంది. తెలుగు ప్రజల గుండెల్లో ఆయకొక విప్లవ గీతం. నేటి యువతకులు ఆయన రచనలే స్ఫూర్తి..విప్లవ గీతాలైనా, దేశభక్తి గీతాలైనా, ప్రణయ గీతాలైనా, విషాద గీతాలైనా, భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతాలెన్నో, అలంటి అభినవ శ్రీశ్రీ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా తన పాటలతో ఎంతో సేవ చేసారు. ఒక తెలుగు పాటకు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడాయన. విప్లవ కవిగా తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తునే, సినీ కవిగా తన రచనలతో సినీ ప్రియులని అలరించారు. తెలుగు వీర లేవరా అంటూ యువతని మేల్కొలిపిన శ్రీశ్రీ జయంతి నేడు.. ఈ సందర్బంగా చిత్ర కళామతల్లికి శ్రీశ్రీ చేసిన రచనా సేవల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

శ్రీ రంగం శ్రీనివాసరావు..

సమాజాన్ని తన కలంతో నిద్రలేపిన రచయిత శ్రీ శ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న జన్మించిన శ్రీశ్రీ మద్రాసు యూనివర్సిటీలో బి.ఏ పూర్తి చేసి, 1938 లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో, నిజాం సంస్థానంలో, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించాడు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ మహాప్రస్థానం నిలిచిపోయింది. ఇక మహా ప్రస్థానం అనేది మహా భారతంలోని 17వ పర్వం పేరు పెట్టారు. ఆయనపై మహా భారత, రామాయణల ప్రభావం ఉన్నా కూడా, జీవితాంతం కమ్యూనిస్టుగానే బతికారు. ముఖ్యంగా ఇక ఆరోజుల్లో తన కవితలతో భావితరాలకు స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ సినిమాల పరంగా కూడా తన కలంతో, పదునెక్కిన మాటల తూటాలతో పాటలు రాసి శభాష్ అనిపించారు.

ప్రజల్ని చైతన్యం చేసి జాతీయ అవార్డు తెచ్చిపెట్టాడు..

ఇక ఆరోజుల్లో శ్రీశ్రీ (SriSri Birth Anniversary) రాసిన సందేశాత్మక గీతాలు తెలుగు సినీ ప్రియులని కూడా ఎంతో ఆకర్షించేవి. 1952 లో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచి, 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. ఇక అప్పట్లో తెలుగు చలన చిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’లో చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట అద్భుత స్పందన తెచ్చుకోగా, తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యంలా నిలిచిపోయింది. ఇక ఈ గీతానికే తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు తన రచనతో గౌరవం దక్కేలా చేసారు శ్రీశ్రీ. వీటితో పాటు “సమరానికి నేడే ఆరంభం”, ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని’.. అంటూ సందేశాత్మక గీతాలు, నేటికి తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తించుకోని తెలుగు వారుండరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు