Chiranjeevi: చిరు మూవీనే రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీరే..!

Chiranjeevi.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో అగ్రస్థానానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈయన సినిమాలను చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు అయితే ఈయన సినిమాలో ఒక్క అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చినా సరే అవకాశాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చినా కూడా వదులుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Chiranjeevi: These are the celebrities who rejected the movie Chiru..!
Chiranjeevi: These are the celebrities who rejected the movie Chiru..!

చిరు మూవీ ను రిజెక్ట్ చేసిన విజయశాంతి..

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాలో ముందుగా విజయశాంతి నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది.. ఆ తర్వాత మరో సినిమాలో కూడా కనిపించలేదు.. దీంతో ఇప్పుడు చిరంజీవి సినిమాలో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.. అయితే విజయశాంతి వేర్వేరు కారణాల వల్ల చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే గతంలో చిరంజీవి, విజయశాంతి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.. అందుకే వీరిద్దరి కాంబో ని మళ్ళీ చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.. కానీ విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ అవకాశాన్ని వదులుకుందని సమాచారం.

సాయి పల్లవి..

ఇక చిరంజీవి సినిమాను వదులుకున్న మరో హీరోయిన్ సాయి పల్లవి.. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్ర కోసం ఈమెను సంప్రదించగా ఈమె ఈ సినిమా రీమేక్ సినిమా కావడంతో ఆఫర్ ని కాస్త వదులుకుంది.. ఇక అందులో చిరంజీవికి చెల్లిగా సాయి పల్లవి స్థానంలో కీర్తి సురేష్ నటించినా.. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి సినిమా స్ట్రెయిట్ సినిమా అయితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

పృధ్విరాజ్ సుకుమారన్

చిరంజీవి సినిమా వదులుకున్న మరో స్టార్ సెలబ్రిటీ విషయానికి వస్తే.. చిరంజీవి సినిమాను వదులుకున్న మరో నటుడు పృధ్విరాజ్ సుకుమారన్.. గాడ్ ఫాదర్ సినిమాకు డైరెక్టర్గా, మరో సినిమాలో నటుడిగా పృథ్విరాజ్ కు అవకాశం ఇచ్చినా.. ఆయన మాత్రం వేర్వేరు కారణాలవల్ల సినిమాలో నటించలేదు. అలా ఈ ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా సరే వివిధ కారణాల వల్ల వదులుకోవడం గమనార్హం.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు