Kamal Haasan Role : కంసుడిగా కమల్ హాసన్… కఠినమైన నిర్ణయమే

Kamal Haasan Role : ప్రస్తుతం ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి మూవీ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ పోషిస్తున్న పాత్ర గురించి లీక్ బయటకు వచ్చింది. మరి కమల్ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నారు? అంటే…

కంసుడిగా కమల్..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఇది కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటిదాకా ఈ మూవీలో కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ పాత్రను ఇందులో కంసుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రూపొందించారట డైరెక్టర్ నాగ్ అశ్విన్.

కమల్ లుక్ టిజర్ త్వరలో..

కల్కిలో కంసుడి పాత్రలో కనిపించబోతున్న కమల్ హాసన్ తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎంతటికైనా తెగించే క్రూరమైన విలన్ గా నటించాడని తెలుస్తోంది. ఇక సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ కమల్ హాసన్ పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో హీరోగా తన నట విశ్వరూపాన్ని చూపించిన కమల్ మొదటి సారి ఈ పాన్ ఇండియా సినిమాలో క్రూరమైన విలన్ గా అదరగొట్టబోతున్నాడు. ఇప్పటికే కల్కిలో తన పాత్ర గురించి కమల్ హాసన్ హింట్ ఇచ్చారు. ఇందులో కేవలం గెస్ట్ గా నటించాను అంటూ కామెంట్స్ చేశారు. ఆయన సినిమాలో కన్పించేది కొద్దీసేపే అయినా పాత్ర ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే కల్కిలో కమల్ లుక్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ కానుంది.

- Advertisement -

ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లుక్స్, పాత్రలను టీం రివిల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ కల్కి పాత్రను పోషిస్తుంటే, అమితాబ్ అశ్వద్ధామగా కనిపించబోతున్నారు. ఈ రెండు టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. భారీ హైప్ తో రాబోతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కల్కి 2898 మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ కల్కి 2898 మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ గురించి ప్రభాస్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇప్పుడు కమల్ హాసన్ రోల్ కు సంబంధించిన ఈ రూమర్ కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు