Indian2 : శంకర్ స్టైల్ లో కళ్లుచెదిరేలా జరగబోతున్న ఇండియన్2 ప్రీ రిలీజ్ ఈవెంట్..

Indian2 : ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ ఫైనల్ గా జూన్ లో రిలీజ్ కాబోతుందన్న విషయం తెలిసిందే. శంకర్ షణ్ముగం లోక నాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 దాదాపు నాలుగున్నరేళ్లుగా తెరకెక్కుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టనుంది. లైకా ప్రొడక్షన్ సంస్థ దాదాపు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఆ మధ్యలో ప్రొడ్యూసర్స్ వివాదాంశాలతో, అలాగే షూటింగ్ లో ఆక్సిడెంట్ వల్ల సినిమా ఆపేయగా, మళ్ళీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫినిష్ చేసారు. ఇక దీని వల్ల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిందన్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం అందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపొయింది.

మే 15న గ్రాండియర్ గా ఈవెంట్..

ఇక తాజాగా ఇండియన్2 చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డేట్ తో సహా వేదిక ఖరారైంది. ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 15న చెన్నైలోని నెహ్రు స్టేడియంలో నిర్వహించేందుకు ఏరాట్లు చేస్తున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ శంకర్ స్టయిల్ లో గ్రాండియర్ గా జరుగనుందని సమాచారం. గతంలో రోబో, ఐ లాంటి సినిమాలకు ఏ రేంజ్ లో ఆడియో లాంచ్ నిర్వహించారో తెలిసిందే గా. ఇప్పుడు ఇండియన్ 2 కి కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ లు గా హాజరవనున్నారని తెలుస్తుంది.

జూన్ 13న రిలీజ్.. పర్ఫెక్ట్ టైం ఇదే?

ఇక ఇండియన్2 (Indian2) జూన్ లో రిలీజ్ అవుతుందని మేకర్స్ కంఫర్మ్ చేసినా డేట్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే చిత్ర యూనిట్ నుండి వస్తున్న వార్తల ప్రకారం జూన్ 13నే సినిమా రిలీజ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ రిలీజ్ డేట్ ని పర్ఫెక్ట్ అని తేల్చేస్తున్నారు. టాలీవుడ్ లో గాని, అటు కోలీవుడ్ లో గాని బడా సినిమాలు వచ్చి నెలయింది. ఇక మే లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. కాబట్టి జూన్ 13 ఇండియన్ 2 రిలీజ్ కి కరెక్ట్ టైం అని అంటున్నారు. ఇక దీనికి సరిగ్గా వారం ముందు ఇండియన్ ఫస్ట్ పార్ట్ ని రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జూన్ 13 తర్వాత మళ్ళీ కల్కి 2898AD వచ్చేవరకు సినిమాలు పెద్దగా ఉండవు కాబట్టి, రెండు వారాల పాటు కలెక్షన్స్ కొల్లగొట్టడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. పైగా రిలీజ్ కి రెండు నెలల సమయం ఉంది కాబట్టి, జనాల్లోకి సినిమాని ప్రమోట్ చేయడానికి బాగానే టైం ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా అనిరుద్ బీజీఎమ్ నిలిచే అవకాశం ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు