Kalki 2898 AD Release Date : కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్… మంచి భవిష్యత్ కోసం అన్నీ ఫోర్సెస్ కలిసొచ్చేది ఆ రోజే

Kalki 2898 AD Release Date : దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరి కళ్ళు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ పైనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. మేకర్స్ కల్కి మూవీ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.

జూన్ లోనే తెరపైకి కల్కి..

డార్లింగ్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దశకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైజయంతి మూవీస్ నిర్మాతలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఓ అప్డేట్ ఉంటుందని ముందుగానే ప్రకటించి క్యూరియాసిటీని పెంచేశారు. అప్డేట్ వచ్చినప్పటి నుంచి క్షణక్షణం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తాజాగా తెరదించారు మేకర్స్. ఇప్పటిదాకా వచ్చిన రూమర్లన్నీకి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూన్ 27న కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోందని ప్రకటించారు చిత్ర బృందం. రిలీజ్ డేట్ ను కొత్త పోస్టర్ తో ప్రకటించగా, అందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఫుల్ యాక్షన్ మోడ్ లో కన్పిస్తున్నారు. మంచి భవిష్యత్ కోసం అన్నీ ఫోర్సెస్ కలిసి జూన్ 27న రాబోతున్నాయి అంటూ కల్కి మూవీ రిలీజ్  డేట్ ను చెప్పేశారు.

కల్కి ఎన్నిసార్లు వాయిదా పడిందంటే?

ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదికగా రోజుకో వార్త వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి మేకర్స్ ఈ మూవీని ముందుగా జనవరి కానుకగా తీసుకురావాలి అనుకున్నారు. పలు కారణాల వల్ల వెనక్కి తగ్గి తమకు కలిసి వచ్చిన మే 9న మూవీని రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. సెంటిమెంట్ గా భావించిన మే నెలలోనే ఎలక్షన్స్ కూడా రావడంతో ఎంతో తర్జన భర్జన పడి జూన్ 27ను ఫైనల్ గా కల్కి మూవీ రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

జూన్ 27 ఎంత వరకు వర్కౌట్ అవుతుంది ?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కల్కి రిలీజ్ డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. జూన్ 27న మూవీని రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ డేట్ ను మేకర్స్ కన్ఫామ్ చేయడం అనేది ఒక రకంగా సంతోషంగానే అనిపించినప్పటికీ, అసలు జూన్ ఎండింగ్ లో రిలీజ్ చేయడం ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. జూన్ 27 అనేది అసలు ఎలాంటి పండగలు లేని టైం మాత్రమే కాదు పిల్లలకు కంప్లీట్ గా సమ్మర్ హాలిడేస్ కూడా పూర్తవుతాయి. స్కూల్స్, కాలేజీలు కూడా మొదలయ్యే టైం. ఒక్క వీకెండ్ అన్న మాట తప్ప ఇంకెలాంటి స్పెషల్ లేని సమయం అది. మరి అలాంటి టైంలో ఇంత భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అయితే సక్సెస్ అవుతుందా? హిట్ టాక్ వచ్చినప్పటికీ ఊహించినంత రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా? అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. మరి మేకర్స్ కలెక్షన్స్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారు అన్నది వెయిట్ అండ్ సి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు