Amani: అందుకే విడిపోయాం.. క్లారిటీ ఇదే..!

Amani.. అలనాటి తెలుగు హీరోయిన్లలో హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరీర్ లో ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి మెప్పించింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈమె బాగా కనెక్ట్ అయిపోయింది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే చాలా అరుదుగా సినిమాలు చేస్తోంది ఆమని. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఉత్తమమైన ఇల్లాలుగా వెండితెర పైన నటించి పేరు సంపాదించుకున్న ఆమని.. తన పాత్ర బాగా పండడం కోసం ఎలాంటి రిస్కులైనా చేస్తూ ఉంటుంది.

Amani: That's why we broke up.. This is the clarity..!
Amani: That’s why we broke up.. This is the clarity..!

వైవాహిక జీవితంలో ఇబ్బందులు..

అయితే రియల్ లైఫ్ లో మాత్రం తన వైవాహిక బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది. ఆమని తమిళ సినీ నిర్మాత ఖాజా మొహిముద్దీన్ ను వివాహం చేసుకుంది.. కేవలం వీరిద్దరి అభిప్రాయాలు ఒక్కటిగా ఉన్నందువల్ల వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఒక కూతురు, కొడుకు కూడా జన్మించారు.వివాహమైన తర్వాత ఆమె భర్తకి సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడంతో నెమ్మదిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.. అయితే చాలా కాలం తర్వాత మధ్య మధ్యలో కొన్ని చిత్రాలలో నటించింది. తనకు సినిమాలంటే చాలా ఇష్టం.. మరోవైపు తన భర్త వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు.. దీంతో వీరిద్దరి మధ్య ఇబ్బందులు రావడం వల్ల ఒక అండర్స్టాండింగ్ తో విడిపోయినట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఆమని. అయినప్పటికీ కూడా తామిద్దరం ఇప్పటికీ టచ్ లోనే ఉన్నామని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామని కూడా తెలియజేసింది. మొత్తానికి అయితే ఒక నిర్ణయంతోనే విడాకులు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది ఆమని.

విడాకులయ్యాయి.. పిల్లల బాధ్యత కూడా నాదే..

కానీ పిల్లల బాధ్యత మాత్రం తానే తీసుకున్నానని.. వారే తన ప్రపంచంలా ప్రస్తుతం బ్రతుకుతున్నానంటూ ఆమని తెలియజేసింది.. ఈ సినిమా షూటింగ్ ల వల్ల వారి పెంపకం ఇబ్బంది అవుతోందని.. కానీ మేనేజ్ చేసుకుంటూ.. వారిని పెంచానంటూ తెలుపుతోంది ఆమని. ఇలాంటి సమయంలోనే ఆమని పైన ఒక ఆరోపణ కూడా వినిపించింది.. అదేమిటంటే ఆమని భర్త అప్పుల పాలు కావడం చేత.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందనే వార్త వినిపించడంతో ఈ విషయం పైన ఆమని స్పందిస్తూ అది నిజం కాదంటూ వెల్లడించింది.

- Advertisement -

రూమర్స్ పై క్లారిటీ..

వాస్తవానికి అప్పులు తీరిపోయాయని.. ఆ సమస్య ఇప్పుడైతే లేదని.. ఒకప్పుడు తానే సినిమాలు మానేశాను అని ,తన సినిమా కెరియర్ పై ఎవరి నిర్ణయం లేదు అని తనకు ఇష్టం వచ్చినప్పుడే సినిమాలలో నటించాను అని తెలిపింది.. ఎవరికి వారు బిజీగా ఉండడం చేత విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా వెల్లడించింది ఆమని.

ఆమని సినిమాలు..

మొదట జంబలకడిపంబ సినిమాతో తన కెరీర్ ని మార్చుకుంది ఆమని.. ఆ తర్వాత హలో బ్రదర్, శుభలగ్నం ,ఘరానా బుల్లోడు, మావిచిగురు, చందమామ కథలు తదితర చిత్రాలలో నటించి పలు రకాల అవార్డులను కూడా అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు