Aquaman 2 OTT Streaming : ఓటిటిలోకి రాబోతున్న ఆక్వామెన్ సీక్వెల్… ఎక్కడ చూడొచ్చంటే?

Aquaman 2 OTT Streaming : హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ 2023 డిసెంబర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇన్ని నెలల గ్యాప్ తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది ఈ హాలీవుడ్ మూవీ. మరి ఆక్వామెన్ సీక్వెల్ ఏ ఓటిటిలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నిర్మాతలకు కాసుల వర్షం…

హాలీవుడ్ నుంచి వచ్చే పలు సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఆక్వామెన్ సీక్వెల్ ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. 2018లో రిలీజ్ అయిన ఆక్వామెన్ మూవీకి సీక్వెల్ గా ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీతో నిర్మాతలు మంచి లాభాలను జేబులో వేసుకున్నారు. 215 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆక్వామెన్ 2 మూవీ 435 మిలియన్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.

5 నెలల తరువాత ఓటీటీలోకి…

ఆక్వామెన్ 2 మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలల తర్వాత ఓటిటి రిలీజ్ కాబోతోంది. మే 21 నుంచి జియో సినిమా ఓటిటిలో ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ స్ట్రీమింగ్ కానుండగా, ఈ మూవీని ఫ్రీగానే చూసే వెసులుబాటును కల్పిస్తోంది జియో సినిమా. ఇక ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

ఆక్వామెన్ 2 స్టోరీ…

జోసన్ మోమోవా సినిమాలో సూపర్ హీరో ఆక్వామెన్ పాత్రను పోషించారు. ఆక్వామెన్ అలియాస్ ఆర్థర్ కర్రీ యుద్ధంలో తన సోదరుడు ఓరంను ఓడించి అట్లాంటిస్ కు రాజు అవుతాడు. మోరాను పెళ్లి చేసుకుని తన కూతురితో నార్మల్ గా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే డేవిడ్ కేన్… బ్లాక్ ట్రైడెంట్ సహాయంతో కొత్త శక్తులను కూడగట్టుకొని ఆక్వామెన్ పై పగ తీర్చుకోవడానికి రెడీ అవుతాడు. మరి విలన్ ముందు బలం సరిపోని ఆక్వామెన్ డేవిడ్ కెన్ ను ఎలా అంతం చేశాడు? ఆక్వామెన్ చేతిలో ఓడిపోయిన అతని సోదరుడు ఓరం వెనక్కి వచ్చి ఏం చేశాడు? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సీక్వెల్ లో కావలసినంత కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇండియన్ హీరోలతో ఆక్వామెన్ పోటీ…

షారూఖ్ ఖాన్ డంకీ, ప్రభాస్ సలార్ సినిమాల మధ్య 2023 డిసెంబర్లో భారీ క్లాష్ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే టైంలో ఆక్వామెన్ 2 కూడా ఇండియాలో రిలీజ్ అయింది. కానీ ఇద్దరు ఇండియన్ సూపర్ హీరోలైన ప్రభాస్, షారుఖ్ సినిమాలతో పోటీని తట్టుకోలేకపోయింది ఈ హాలీవుడ్ మూవీ. ఇండియాలో ఈ మూవీ మొదటి రోజు రెండు కోట్లలోపే కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు దక్కకపోవడం, నెగెటివ్ టాక్ రావడం కూడా దీనికి మరో రీజన్ అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు